Attacked ON RTC Driver: నడిరోడ్డుపై ఆర్టీసీ డ్రైవర్ కు నరకం చూపించిన వైసీపీ నేతలు.. దారుణ వీడియోలు వైరల్

ఏపీలో వైసీపీ నేతల అరాచకాలకు అంతేలేకుండా పోతోంది.బెంగళూరు నుంచి విజయవాడ వస్తున్న ఏపీ 16 జెడ్ 0702 నంబరు బస్సు గురువారం సాయంత్రం కావలి నుంచి గమ్యస్థానానికి బయలుదేరింది.

Written By: Dharma, Updated On : October 28, 2023 3:00 pm

Attacked ON RTC Driver

Follow us on

Attacked ON RTC Driver: రోడ్డుకు అడ్డంగా ఉన్న బైకును పక్కకు తీయాలని హారన్ కొట్టడమే ఆర్టీసీ డ్రైవర్ తప్పు అయ్యింది. వెంటాడారు.. వెంబడించారు. నడిరోడ్డుపై బస్సు మీద నుంచి కిందకు దించి దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టారు. ఈపాటికే మీకు ఒక పిక్చర్ వచ్చుంటుంది. ఈ ఘటనకు ఎవరు పాల్పడి ఉంటారో అర్థమై ఉంటుంది. మీరు ఊహించింది నిజమే. చేసింది అధికార వైసీపీ నేతలే. నెల్లూరు జిల్లా కావలిలో వెలుగు చూసింది ఈ ఘటన. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

ఏపీలో వైసీపీ నేతల అరాచకాలకు అంతేలేకుండా పోతోంది.బెంగళూరు నుంచి విజయవాడ వస్తున్న ఏపీ 16 జెడ్ 0702 నంబరు బస్సు గురువారం సాయంత్రం కావలి నుంచి గమ్యస్థానానికి బయలుదేరింది. ట్రంక్ రోడ్డు మీదుగా వెళుతున్నప్పుడు ఓ ద్విచక్ర వాహనం రోడ్డుకు అడ్డంగా ఉంది. బస్సు డ్రైవర్ బిఆర్ సింగ్ హారన్ మోగించారు. దీంతో వాహనదారుడు డ్రైవర్ తో వాదనకు దిగాడు. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు రావడంతో వాగ్వాదానికి దిగిన వాహనదారుడు వెళ్ళిపోయాడు.

బస్సు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత.. ఓ కారు వెంబడిస్తూ బస్సు ముందు ఆగింది. కారు నుంచి ఓ 14 మంది దిగారు. బస్సు డ్రైవర్ను కిందకు దింపేశారు. విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కాలితో కడుపులో తన్నారు. పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఆ సమయంలో అస్వస్థతకు గురై డ్రైవర్ కింద పడినా వదిలిపెట్టలేదు. ఇక్కడే చంపి పాతి పెడతాం. ఎవరొస్తారో చూస్తామంటూ హెచ్చరించారు. ఈ దారుణ ఘటనను అక్కడున్నవారు సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండగా అడ్డుకున్నారు. అయినా కొంతమంది రహస్యంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో దాడి చేసిన వారంతా వైసీపీ నేతలుగా తేలింది. వారి తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు స్పందించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది.

ఈ ఘటనకు సంబంధించి దేవరకొండ సుధీర్, శివారెడ్డి, మల్లి, విల్సన్, కిరణ్ లతోపాటు మొత్తం పదిమందిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. డ్రైవర్ పై దాడి చేసిన వారిపై ఇప్పటికే నేరారోపణలు ఉన్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలతో పాటు స్థానికులు కోరుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు ఉంటాయని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఒక ప్రత్యేక ప్రకటనలో తెలిపారు.