South Africa Vs Pakistan: సౌత్ ఆఫ్రికా vs పాకిస్తాన్ మ్యాచ్ లో ఒక స్పెషల్ ఉంది.. అది గమనించారా?

సౌతాఫ్రికా టీమ్ వరల్డ్ కప్ లో ఇంత భారీ స్కోరు ని చేజ్ చేయడం ఇది రెండోవ సారి మొదటి సారి 2011 వ సంవత్సరం వరల్డ్ కప్ లో ఇండియన్ టీమ్ మీద 297 పరుగుల లక్ష్యాన్ని చేదించారు.

Written By: Gopi, Updated On : October 28, 2023 3:09 pm

South Africa Vs Pakistan

Follow us on

South Africa Vs Pakistan: సౌతాఫ్రికా, పాకిస్థాన్ టీమ్ ల మధ్య జరిగిన ఒక ఉత్కంఠను నెలకొల్పి మ్యాచ్ లో ఫైనల్ గా సౌతాఫ్రికా మంచి విజయాన్ని అందుకుంది. నిజానికి ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ కూడా చాలా వరకు శ్రమించినప్పటికి ఫలితం మాత్రం సౌతాఫ్రికా అనుకూలంగా వచ్చింది. ఇక ఈ గెలుపు తో సౌతాఫ్రికా టీమ్ పాయింట్స్ టేబుల్ లో నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకుంటే, పాకిస్థాన్ టీమ్ మాత్రం సెమీస్ కి వెళ్ళే చివరి అవకాశాన్ని కూడా క్లోజ్ చేసుకుంది ఇక ఇలాంటి క్రమం లో పాకిస్థాన్ లాంటి టీమ్ ఇంటికి పోవడానికి రెఢీ గా ఉంది…

అయితే సౌతాఫ్రికా టీమ్ వరల్డ్ కప్ లో ఇంత భారీ స్కోరు ని చేజ్ చేయడం ఇది రెండోవ సారి మొదటి సారి 2011 వ సంవత్సరం వరల్డ్ కప్ లో ఇండియన్ టీమ్ మీద 297 పరుగుల లక్ష్యాన్ని చేదించారు.అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత భారీ స్కోర్ ని వాళ్లేప్పుడు చేజ్ చేయలేదు. ఇక సౌతాఫ్రికా టీమ్ మొదట బ్యాటింగ్ చేస్తేనే గెలుస్తుంది లేకపోతే అసలు మ్యాచ్ లు గెలవదు అనే ఒక బ్యాడ్ నేమ్ నుంచి ఇప్పుడిప్పుడే సౌతాఫ్రికా చేజింగ్ లో కూడా మ్యాచ్ లు గెలుస్తుంది అనే పేరు ను సంపాదించు కుంటు వాళ్ళకంటు ఒక ప్రత్యేకతను చాటుకుంటుంది.

ఇక ఇలాంటి సమయం లో సౌతాఫ్రికా ఇంకొక మ్యాచ్ గెలిస్తే సెమీస్ కి చేరుకుంటుంది. అయితే నిన్న పాకిస్థాన్ మీద జరిగిన మ్యాచ్ లో ఒక అరుదైన సంఘటన జరిగింది.కంకేషన్ సబ్ స్టుడ్ గా వచ్చిన ఉసమామిర్ అద్బుతం చేశాడు…పాకిస్థాన్ ప్లేయర్ అయిన షదాబ్ ఖాన్ తల కి దెబ్బ తగలడం తో ఆయన ప్లేస్ లో బౌలింగ్ చేయడానికి ఉసమామిర్ టీమ్ లోకి రావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఎప్పుడు లేని విధం గా కంకేషన్ సబ్ స్టుడ్ ని ఈ వరల్డ్ కప్ లో ప్రవేశ పెట్టడం జరిగింది.ఇలా చేయడం ద్వారా పాకిస్తాన్ టీమ్ కూడా చాలా వరకు లాభాపడిందనే చెప్పాలి…

కంకేషన్ సబ్ స్టుడ్ అంటే ఎవరైనా ప్లేయర్ ఫీల్డింగ్ చేసేటపుడు గాయానికి గురి అయితే ఆ సమయం లో ఆయన మ్యాచ్ అడలేని పరిస్థితి లో ఉంటే ఆయన బ్యాట్స్ మెన్ అయితే ఆయన ప్లేస్ లో మరో బ్యాట్స్ మెన్ ని తీసుకోవచ్చు లేదా బౌలర్ అయితే మరో బౌలర్ ని తీసుకోవచ్చు నిజంగా ఈ వరల్డ్ కప్ లో ఈ రూల్ అనేది చాలా బాగుంది…ఈ అవకాశాన్ని మొదటి సారి వాడుకున్న టీమ్ గా పాకిస్థాన్ నిలిచింది…