Indian Army : న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో పోస్టులు, వీడియోలు చూసే ఉంటారు. వారి వృత్తికి సంబంధించి చాలా తక్కు వ మంది పోస్ట్ చేస్తే ఎక్కువ పోస్టులు వారి ఫోటోలనే పంచుకున్నారు. అందమైన ఫోటోలు దిగుతూ ఫ్యాషన్ దుస్తులతో ఉన్న చిత్రాలను ఎక్కువగా పంచుకున్నారు. ఇక సెలబ్రెటీల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వీరిలో చాలా మంది టూ పీస్ డ్రెస్ లు వేసుకొని మరీ హ్యాపీ న్యూయర్ తెలుపుతూ పోస్ట్ చేశారు. అయితే ఇండియన్ ఆర్మీ షేర్ చేసిన ఓ వీడియోను మీరు చూశారా?
ఆర్మీ షేర్ చేసినా ఈ వీడియోను చూస్తే వారికి సెల్యూట్ కొట్టకుండా ఎవరూ ఉండరు. ఇంట్లో చలికి వణుకుతూ కాస్త చల్లగా అయిన అన్నం తినాలి అంటే ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది మోకాల్లు చిట్లే చలిలో వారి వృత్తి కోసం, భారతదేశం కోసం వారు పడే కష్టం చూస్తే కన్నీరు రావడం పక్కా అంటున్నారు వీడియో చూసిన నెటిజన్లు. అయితే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, లడఖ్ వంటి ప్రాంతాలలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సామన్య ప్రజలు ఇంట్లో ఉండి రక్షణ తీసుకుంటే సైనికులు మాత్రం బార్డర్ లో గస్తీ కాస్తున్నారు. ఇక వీరు షేర్ చేసిన ఈ వీడియోలో తమ సైనికులు విధిలో స్థిరంగా ఉన్నారని భారత సైన్యం బుధవారం సైనికులు చేసిన అద్భుతమైన త్యాగాల గురించి తెలియజేస్తూ ట్విట్టర్ లో ఓ వీడియో పంచుకుంది.
కొత్త సంవత్సరం సందర్బంగా మన సైనికులు, ముఖ్యంగా జమ్మూ & కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద కాపలాగా ఉన్నవారు చేసిన అద్భుతమైన త్యాగాలను ప్రతిబింబించడానికి కొంత సమయం కేటాయించడం చాలా ముఖ్యం” అని భారత సైన్యం పేర్కొంది. ఇక “భారత సైన్యం, తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఉన్నా కూడా వాటిని లెక్క చేయకుండా గస్తీ కాస్తున్నారు అంటూ పేర్కొంది. ఇక రాజస్థాన్‌లో వేసవిలో వేడి నుంచి లడఖ్, J&K, హిమాచల్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో చలికాలంలో ఎముకలు కొరికే చలి వరకు వారి విధి నిర్వహణలో స్థిరంగా ఉంటారు అంటూ పేర్కొంది.
రుతుపవనాల సమయంలో తరచుగా మంచుతో కప్పబడి లేదా చిత్తడి నేలగా మారే కఠినమైన, ప్రమాదకరమైన భూభాగం నిరంతరం సవాళ్లను ఎదుర్కునేలా చేస్తుంది. అయినప్పటికీ మన సైనికులు అచంచలమైన నిబద్ధతతో పట్టుదలతో ఉంటూ బార్డర్ లో గస్తీ కాస్తుంటారు అని కొనియాడింది. మీరు కూడా ఓ సారి వీడియోను నిశితంగా పరిశీలిస్తే చాలా ఆశ్చర్యంగా వారి అంకిత భావానికి సెల్యూట్ కొట్టాలి అనిపిస్తుంది కదా. మంచులో వారు చేసే పనిని పెద్ద సాహసమే అని చెప్పాలి.
ఇటీవల, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది డెహ్రాడూన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాచరణ సంసిద్ధతను సమీక్షించారు. దళాలతో సంభాషించారు. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న భద్రతా కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కొంతమంది ఉన్నతాధికారుల నుంచి “సమగ్ర బ్రీఫింగ్‌లు” అందుకున్నారని ఓ వార్తా సంస్థ నివేదిక తెలిపింది.
#WATCH | As we welcome the New Year, it's important to take a moment to reflect on the incredible sacrifices made by our soldiers, especially those guarding the Line of Control (LoC) in Jammu & Kashmir. The Indian Army, despite facing extreme weather conditions — from searing… pic.twitter.com/dcYqKQb18m
— ANI (@ANI) January 1, 2025