https://oktelugu.com/

Telangana Power Crisis: తెలంగాణలో కరెంట్‌ కష్టాలు మళ్లీ మొదలయ్యాయా? రైతు ఆవేదన వైరల్‌

తమ నేతలే ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే తామెందుకు మౌనంగా ఉండాలని సోషల్‌ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఇలా పావని గౌడ్‌ అనే బీఆర్‌ఎస్‌ నాయకురాలు ఓ రైతు వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 14, 2023 2:53 pm
    Farmers viral video
    Follow us on

    Telangana Power Crisis: తెలంగాణలో కాంగ్రెస్‌ వస్తే కరెంటు కష్టాలు మొదలైతయ్‌.. కాంగ్రెస్‌ కావాలా.. కరెంటు కావాలా మీరే తేల్చుకోండి.. మాకేం కాదు.. ఓడిస్తే ఇంట కూర్చుంటం.. నష్టపోయేది మీరే’ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పదేపదే హెచ్చరించారు. ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. డిసెంబర్‌ 7న సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణం చేశారు. వారం రోజులు తిరగక ముందే.. బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ సర్కార్‌పై విమర్శలు మొదలు పెట్టారు. కడియం శ్రీహరి, హరీశ్‌రావు, కేటీఆర్‌ ఎన్నిల హామీలపై నిలదీస్తున్నారు. దీంతో కిందిస్థాయి నేతలు కూడా రెచ్చిపోతున్నారు.

    రైతు వీడియో వైరల్‌..
    తమ నేతలే ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే తామెందుకు మౌనంగా ఉండాలని సోషల్‌ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఇలా పావని గౌడ్‌ అనే బీఆర్‌ఎస్‌ నాయకురాలు ఓ రైతు వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. ఇందులో రైతు వారం రోజుల నుంచి కరెంటు కోతలు లేవని, రైతుబంధు పైసలు రాలేదని, పింఛన్లు వస్తలేవని రైతు పేర్కొన్నాడు. అందులో రైతుతో ఈ అంశాలను చెప్పించి, అనేక ఎడిట్‌లు చేసి క్రియేట్‌ చేసిన కాంగ్రెస్‌ వ్యతిరేక వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు. కాంగ్రెస్‌ వచ్చింది కరెంటు కోతలు మొదలయ్యాయి అనే కాన్సెప్ట్‌తో ఈ వీడియో చేశారు.

    నిజంగా మొదలయ్యాయా..
    నిజంగా కాంగ్రెస్‌ వచ్చాక కరెంటు కోతలు మొదలయ్యాయా అంటే.. లేవనే అంటున్నారు రైతులు. గతంలో సరఫరా చేసినట్లుగానే ఇప్పుడూ కరెంటు ఇస్తున్నారని అంటున్నారు. విద్యుత్‌ సంస్థల పేరిట రూ85 వేల కోట్లు అప్పు చేసిన విషయాన్ని దాచిన కేసీఆర్‌ ప్రజల నెత్తిన భారం మోపిన విషయం ఎవరికీ తెలియదు. కాంగ్రెస్‌ వచ్చాక ఈ విషయం వెలుగు చూసింది. ఇలా ఒక్కో అవినీతి వెలికితీసే పనిలో కాంగ్రెస్‌ ఉండడంతో అప్రమత్తమైన మాజీ మంత్రులు కే టీఆర్, హరీశ్‌రావులు కాంగ్రెస్‌పై వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టారు. మరోవైపు తాము కాంగ్రెస్‌పై కక్ష సాధించలేదని, మీరు కూడా కక్ష సాధించొద్దని కోరుతున్నారు. మరోవైపు యూట్యూబ్, ట్విట్టర్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా విస్తృతంగా కరెంటు ఉండడం లేదని, రైతుబంధు రాలేదని, పింఛన్లు ఇస్తలేరని ప్రచారం చేయిస్తున్నారు.