
సోషల్ మీడియా ఎంత పవర్ ఫుల్లో అందరికీ తెలిసిందే. అలా అని ఇష్టం వచ్చినట్లుగా ఏది పడి అది పోస్టు చేస్తామంటూ పనిష్‌మెంట్‌కు సిద్ధం కావాల్సి వస్తుంది. కామన్‌గా సోషల్ మీడియా ఏదైనా కూడా కేంద్రం కనుసన్నల్లోనే నడుస్తుంటాయని అందరూ అనుకుంటారు. సరే.. అందులో ఏ పాటి వాస్తవం ఉందో కానీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఎమ్మెల్యేకే తాజాగా ఫేస్‌బుక్ షాక్ ఇచ్చింది.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. ఈయన పేరు తెలియని వారు ఉండరు బహుషా. ప్రతిపక్షాలపై సంధించడంలో ఆయనకు ఆయనే సాటి. ఏదో ఒకటి మాట్లాడుతూ వివాదస్పదం అవుతూనే ఉంటారు. తాజాగా.. ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టింగ్ వివాదానికి దారితీసింది. ఏకంగా ఫేస్‌బుక్ సంస్థనే స్పందించి ఎమ్మెల్యే అకౌంట్‌నే బ్లాక్ చేసేసింది. ఆయనపై నిషేధం విధించింది. ‘వివాదాస్పద వ్యాఖ్యలు, హింసను ప్రేరేపించే వ్యాఖ్యల విషయంలో మా నియమావళిని ఎమ్మెల్యే ఉల్లంఘించారు. అందుకే తెలంగాణలోని ఏకైక బీజేపీ రాజాసింగ్‌పై నిషేధం ప్రకటించాం’ అంటూ ఫేస్‌బుక్ ప్రతినిధి తెలిపారు.
మరోవైపు రాజాసింగ్‌పై ఆరోపణలు రావడంతో వారం క్రితమే ఆయన ఓ వివరణ ఇచ్చారు. తనకు అధికారికమైన ఫేస్‌బుక్ పేజ్ లేదని, తన పేరుమీదుగా చాలా మంది ఫేస్‌బుక్ పేజీని నడుపుతున్నారని స్పష్టం చేశారు. తనకు అధికారికమైన ఫేస్‌బుక్ పేజీ లేదని, అందుకే ఏ పోస్టుకూ తాను బాధ్యుడ్ని కాదని కూడా రాజా సింగ్ గతంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
కామన్‌గా పొలిటికల్ లీడర్లకు ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్లు ఉండడం కామన్. కానీ.. తనకు ఎలాంటి ఫేస్‌బుక్ అకౌంట్ లేదని రాజాసింగ్ చెప్పడం.. తన అకౌంట్లో వివాదాస్పద పోస్టింగ్ పెట్టారంటూ ఫేస్‌బుక్ నిషేధం విధించడం గందరగోళానికే దారితీసింది. మరి రాజాసింగ్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసింది ఎవరు..? అందులో వివాదాస్పద వ్యాఖ్యలు పెట్టింది ఎవరు..? ఈ విషయం తేలాల్సి ఉంది.