Homeఎన్నికలుHaryana Assembly Elections 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు : కాంగ్రెస్‌ కీలక నిర్ణయం.. ముగ్గురికీ...

Haryana Assembly Elections 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికలు : కాంగ్రెస్‌ కీలక నిర్ణయం.. ముగ్గురికీ బాధ్యతలు.. ఎవరంటే..

Haryana Assembly Elections 2024: హర్యానా, జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంఇ. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో ప్రచారంలో అన్నిపార్టీలు నిమగ్నమయ్యాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రానికి సంబంధించిన మేనిఫెస్టోను ప్రకటించింది. ఇక ఇప్పటికే అధికారంలో ఉన్న హర్యానాను నిలబెట్టుకునేందుకు యత్నిస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌ కూడా లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల జోష్‌తో ఇటు హర్యానాలో, అటు జమ్మూ కశ్మీర్‌లో పాగా వేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే హరియానా ఎన్నికల కోసం ప్రత్యేకంగా ముగ్గురు సీనియర్‌ నేతలను పరిశీలకులుగా నియమించింది.

ముగ్గురు పరిశీలకులు వీరే..
హర్యానా అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులుగా ఏఐసీసీ నియమించిన వారిలో రాజస్థాన్‌ మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్, పార్టీ సీనియర్‌ నాయకులు అజయ్‌ మాకెన్, పర్తాప్‌ సింగ్‌ బజ్వాలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు. హరియానాలో ఆప్‌తో పొత్తు కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో 90 స్థానాలు ఉన్న హర్యానాలో 89 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను నిలబెట్టింది. కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(మార్క్సిస్ట్‌)కు ఒక స్థానం కేటాయించింది.

త్రిముఖ పోటీ…
ఇదిలా ఉంటే.. హర్యానాలో అధికార బీజేపీ, కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. రాష్ట్రంలో పదేళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. రెండ పర్యాయాలు విజయం సాధించింది. అయితే ఈసారి బీజేపీకి కాంగ్రెస్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. నాలుగు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 10 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ చెరో ఐదు గెలిచాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ కూడా గెలుపుపై ధీమాగా ఉంది. అయితే బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు ప్రస్తుతం ఆప్‌ కూడా పోటీలో ఉంది. దీంతో త్రిముఖ పోరులో తమకే లాభం కలుగుతుందని బీజేపీ భావిస్తోంది.

అక్టోబర్‌ 5న ఎన్నికలు..
ఇదిలా ఉంటే.. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్‌ 5న నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఎన్నికల బరిలో వివిధ పార్టీల తరఫున 1,561 మంది నామినేషన్లు వేశారు. స్వతంత్ర అభ్యర్థులతో కలిసి 1,747 మంది నామినేషన్లు వేశారు. ఈరోజు(సెప్టెంబర్‌ 16)తో నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగుస్తుంది. తుది పోరులో ఉండేదెవరో తేలిపోతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular