సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఎన్నికల మెనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలను ఏపీలో అమలు చేస్తున్నారు. అయితే జగన్మోహన్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండు పథకాలు మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. ఈ రెండు పథకాలు ఏపీలో అమలైతే వైసీపీకి తిరుగు ఉండదని వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. దీంతో ఈ పథకాలను ఎలాగైనా అమలు చేయాలని జగన్ సర్కార్ మొండిగా ముందుకెళుతోంది.
Also Read: ‘అదిరింది’ షోపై విరుచుకుపడుతున్న వైసీపీ నేతలు
ఈ రెండు పథకాల్లో మొదటిది పేదలకు ఇళ్ల పంపిణీ.. ఇక రెండోది ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం. ఈ రెండు పథకాలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలతో ముడిపడి ఉండటంతో టీడీపీ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. పేదలకు ఇళ్ల పంపిణీ విషయంలో టీడీపీ పెద్దగా స్పందించకపోయినా తెలుగు మీడియం ఎత్తివేతపై మాత్రం పోరాటాలను చేసింది. ఇంగ్లీష్ మీడియం అమలును వ్యతిరేకిస్తూ ఇప్పటికే పలువురు కోర్టు తలుపులు తట్టారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుపై జగన్ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంలో విచారణ జరుగుతుంది. రేపోమాపో దీనిపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ దీనిపై ఇప్పటికే తగు వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే కోర్టులను తప్పుపట్టకుండా చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరులను తప్పుపట్టేలా వ్యూహాలను వైసీపీ ఇప్పటికే సిద్ధం చేసింది.
Also Read: తెలంగాణలోని మినీ ఇండియా గ్రామం గురించి మీకు తెలుసా..?
పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువులకు నోచుకోకుండా చంద్రబాబు నాయుడు చేశారని ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇన్నిరోజులు వైసీపీ ఇరుకునపెట్టిన తెలుగు మీడియం చదువులను తిరిగి టీడీపీపైనే ప్రయోగించేందుకు రెడీ అవుతోంది. 96శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం చదువులు అమలు చేయాలని కోరినట్లు జగన్ సర్కార్ చెబుతోంది. దీనినే వైసీపీ రాజకీయంగా అస్త్రంగా చేసుకొని టీడీపీని మరింత ఇరుకునపెట్టేలా పకడ్బంధీ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. దీంతో టీడీపీకి రానున్న రోజుల్లో గడ్డుపరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.