హ్యపీ బర్త్ డే పవన్ కల్యాణ్: సినీ, రాజకీయ ప్రస్థానం

సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినం. పవర్ స్టార్ పుట్టిన రోజుకు నెలరోజుల ముందు నుంచే అభిమానుల్లో సందడి మొదలైంది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటూ పవన్ అభిమానులు కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. నేడు ఆయన పుట్టిన రోజు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. పవన్ పేరిట అన్నదానాలు, రక్తదానాలు, కోవిడ్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల […]

Written By: NARESH, Updated On : September 2, 2020 9:25 am
Follow us on

సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినం. పవర్ స్టార్ పుట్టిన రోజుకు నెలరోజుల ముందు నుంచే అభిమానుల్లో సందడి మొదలైంది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటూ పవన్ అభిమానులు కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. నేడు ఆయన పుట్టిన రోజు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. పవన్ పేరిట అన్నదానాలు, రక్తదానాలు, కోవిడ్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ,, దుస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేస్తున్నారు.

*పవన్ సినీ జీవితం..
సెప్టెంబర్ 2, 1971లో కొణిదెల వెంకట్రావ్ శ్రీమతి అంజనాదేవి దంపతులకు పవన్ కల్యాణ్ జన్మించాడు. ఇంటర్మీయట్ వరకు చదివిన పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ పై అభిమానం పెంచుకొని శిక్షణ తీసుకున్నాడు. కల్యాణ్ బాబు పేరును పవన్ కల్యాణ్ గా మార్చుకొని 1996లో సినీ రంగంలోకి ప్రవేశించాడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్లోకి ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’తో ఎంట్రీ ఇచ్చాడు.

*తొలిప్రేమతో తొలిహిట్టు..
1999లో వచ్చిన ‘తొలిప్రేమ’ పవన్ కు మంచి పేరు తీసుకొచ్చింది. యువతను ఆయనకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. గోకులంలో సీత.. సుస్వాగతం వంటి సినిమాలు పవన్ కు స్టార్డమ్ తీసుకొచ్చాయి. ఆ తర్వాత తమ్ముడు.. బద్రి.. ఖుషి.. గుడుంబా శంకర్.. అన్నవరం.. జల్సా.. గబ్బర్ సింగ్.. గోపాల గోపాల.. సర్దార్ గబ్బర్ సింగ్.. అత్తారింటికి దారెదీ.. కాటమరాయుడు, అజ్ఞాతవాసి వంటి తదితర సినిమాల్లో నటించి అభిమానులను మెప్పించారు. వంటి సినిమాల్లో నటించారు. పవన్ దర్శకుడిగా మారి ‘జానీ’ మూవీని తెరకెక్కించాడు.

*ప్లాపులతో సంబంధం లేకుండా స్టార్డమ్..
పవర్ స్టార్ నటించింది కేవలం 25సినిమాలే అయినా అశేష ప్రేక్షక అభిమానులన్నీ, తరగని క్రేజీ సంపాదించుకున్నాడు. హిట్లతో సంబంధం లేకుండా క్రేజ్ సంపాదించుకుంది టాలీవుడ్లో ఎవరైనా ఉందంటే కేవలం పవర్ స్టార్. పవన్ నటించిన సినిమాల్లో ప్లాప్ సినిమాల కలెక్షన్లే టాప్ హీరోలు సాధించిన కలెక్షన్లతో సమానంగా ఉండేదంటే పవన్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు.

*పవన్ రాజకీయ జీవితం..
పవన్ కల్యాణ్ సినిమాలతోపాటు రాజకీయాల్లోనూ కొనసాగుతున్నారు. చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం’ పార్టీలో పవన్ కల్యాణ్ యువరాజ్యం అధినేతగా రాష్ట్రమంతటా పర్యటించారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడంతో పవన్ సినిమాలే పరిమితమయ్యారు. ఇక 2014కు ముందు రాష్ట్ర విభజన సమయంలో పవన్ కల్యాణ్ సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించారు. ఆ సమయంలోనే జనసేన పార్టీని స్థాపించారు. అయితే నాటి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేయకుండా టీడీపీకి మద్దతు ఇచ్చారు.

*టీడీపీకి మద్దతు..
పవన్ కల్యాణ్ మద్దతు టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇక ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. తిత్లీ తుఫాను సమయంలోనూ పవన్ ఉత్తరాంధ్రలో పర్యటించి బాధితులకు అండగా ఉన్నారు. అమరావతి రాజధాని విషయంలో రైతులకు అండగా నిలబడ్డారు. ఇలా ప్రజా సమస్యలపై జనసేన తరుఫున పోరాడుతూనే ఉన్నారు. అయితే కిందటి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీచేసిన ఓటమి పాలవడం ఫ్యాన్స్ తోపాటు తెలుగు ప్రజలందరికీ షాకిచ్చింది.

*పట్టువదలని విక్రమార్కుడిలా..

ఎన్నికల్లో ఓటమి పాలైన పవన్ పట్టువదలకుండా ప్రజా సమస్యలపై పోరాడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. పార్టీ నడిపిందుకు డబ్బులు అవసరం ఉన్నందున మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ‘వకీల్ సాబ్’తో పవన్ కల్యాణ్ మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుండటంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ అంతా ‘నారాజు కాకురా అన్నయ్య.. నసీరు అన్నయ్య.. ముద్దుల కన్నయ్య.. హే మనరోజు మనకుంది మన్నయ్య’ అంటూ జనసేనను ఉద్దేశించి పాటలు పాడుకుంటున్నారు.