67 కోట్లమందికి కరోనా..! ఎప్పటివరుకంటే..

దేశం మొత్తం కరోనా భయంతో వాణికిపోతున్న సమయంలో మరో సంచలన వార్త బయటికి వచ్చింది. 2020 డిసెంబర్ నాటికి భారతదేశంలో ఉన్న సగం మందికి (సుమారు 67 కోట్ల మంది) కరోనావైరస్ వ్యాప్తిచెందుతుందంటూ ఓ సంచలన రిపోర్టు బయటకు వచ్చింది. మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎట్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంట్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్‌ తన రిపోర్ట్ లో వెల్లడించింది. మార్చి 24 నుంచి ఇప్పటివరకు దేశంలో లక్షా 65వేల వరకు కరోనా పాజిటివ్ కేసులు […]

Written By: Neelambaram, Updated On : May 30, 2020 8:57 pm
Follow us on

దేశం మొత్తం కరోనా భయంతో వాణికిపోతున్న సమయంలో మరో సంచలన వార్త బయటికి వచ్చింది. 2020 డిసెంబర్ నాటికి భారతదేశంలో ఉన్న సగం మందికి (సుమారు 67 కోట్ల మంది) కరోనావైరస్ వ్యాప్తిచెందుతుందంటూ ఓ సంచలన రిపోర్టు బయటకు వచ్చింది. మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎట్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంట్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్‌ తన రిపోర్ట్ లో వెల్లడించింది.

మార్చి 24 నుంచి ఇప్పటివరకు దేశంలో లక్షా 65వేల వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 67 కోట్ల మందికి కరోనా సోకినా, తమకు వైరస్ వ్యాపించినట్టు వారిలో కనీసం 90 శాతం మందికి అసలు తెలియనే తెలియదంటూ ఓ ఉపశమనం కల్పించే వార్తను కూడా తెలిపింది.

వైరస్ సోకిన వారిలో సుమారు 5 శాతం మందికి మాత్రం పరిస్థితి విషమంగా ఉంటుందని పేర్కొంది. ఆ లెక్కన 67 కోట్లలో 5 శాతం అంటే సుమారు 3 కోట్ల మంది పరిస్థితి విషమంగా ఉంటుందన్నమాట.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, దేశంలో మరణాల సంఖ్య 5 శాతం కంటే తక్కువే ఉండొచ్చని ఆ సంస్థ తెలిపింది.