లాక్‌డౌన్‌ 5.0లో భారీగా సడలింపు ఇచ్చిన కేంద్రం

కేంద్రం ప్రభుత్వం జూన్ 30వరకు లాక్డౌన్ పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మే31తో లాక్డౌన్ 4.0 ముగిస్తుండటంతో తాజాగా కేంద్రం మరోసారి లాక్డౌన్ పొడిస్తున్నట్లు ప్రకటించింది. లాక్డౌన్ 5.0లో కేంద్రం కొన్ని కీలక రంగాలకు సడలింపులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలోని కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో కార్యకలాపాలకు కేంద్రం అనుమతులను ఇచ్చింది. రాత్రిపూట కర్ఫ్యూను ఇక నుంచి రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 5గంటలకు పరిమితం చేసింది. జూన్ 1నుంచి […]

Written By: Neelambaram, Updated On : May 30, 2020 8:13 pm
Follow us on


కేంద్రం ప్రభుత్వం జూన్ 30వరకు లాక్డౌన్ పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మే31తో లాక్డౌన్ 4.0 ముగిస్తుండటంతో తాజాగా కేంద్రం మరోసారి లాక్డౌన్ పొడిస్తున్నట్లు ప్రకటించింది. లాక్డౌన్ 5.0లో కేంద్రం కొన్ని కీలక రంగాలకు సడలింపులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలోని కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో కార్యకలాపాలకు కేంద్రం అనుమతులను ఇచ్చింది. రాత్రిపూట కర్ఫ్యూను ఇక నుంచి రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 5గంటలకు పరిమితం చేసింది. జూన్ 1నుంచి 30వతేది వరకు కేంద్ర మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని శనివారం కేంద్రం ఉత్తర్వులను జారీ చేసింది.

లాక్‌డౌన్‌ 5.0 సడలింపు మార్గదర్శకాలు:
జూన్‌ 8నుంచి దేవాలయాలు, ప్రార్థనామందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవలు, షాపింగ్‌ మాల్స్‌కు కేంద్రం అనుమతినిచ్చింది. అలాగే పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు తెరుచుకునే అధికారం రాష్ట్రాలకే వదిలేసింది. ఇక విద్యాసంస్థలు పునఃప్రారంభంపై జులైలో నిర్ణయం తీసుకోనుంది. అలాగే హోంశాఖ అనుమతి మేరకు అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, మెట్రో రైలు వ్యవస్థ, అంతర్జాతీయ సర్వీసులకు అనుమతులను ఇచ్చింది.

లాక్‌డౌన్‌ 5.0లో అనుమతి లేనివి..
– మెట్రో రైలు, అంతర్జాతీయ విమాన సేవలు, సినిమాహాల్స్‌, జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, పార్కులు, బార్లకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. రాజకీయ, సామాజిక, క్రీడా కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేదు. లాక్డౌన్ 5.0ద్వారా కేంద్రం దాదాపు అన్నిరంగాలకు మినహాయింపు ఇచ్చినట్లు కన్పిస్తుంది. దీనిని పరిశీలిస్తే కేంద్రం లాక్డౌన్ నుంచి అన్ లాక్ దిశగా వెళుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.