Homeఆంధ్రప్రదేశ్‌Murder: బీటెక్ విద్యార్థిని హత్యకు కారణమదే.. నిందితుడి బ్యాక్ గ్రౌండ్ దారుణం

Murder: బీటెక్ విద్యార్థిని హత్యకు కారణమదే.. నిందితుడి బ్యాక్ గ్రౌండ్ దారుణం

గుంటూరులో జరిగిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కు సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమే కారణమని పోలీసులు తేల్చారు. గుంటూరు ఇన్ చార్జి డీఐజీ రాజశేఖర్ బాబు తాజాగా మీడియాకు ఈ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. నిందితుడు శశికృష్ణ ఇన్ స్టాగ్రామ్ ద్వారా రమ్యకు పరిచయం అయ్యాడని.. ప్రేమ పేరుతో శశికృష్ణ వేధించాడని డీఐజీ తెలిపారు.

శశికృష్ణ వేధింపులతో రమ్య అతడిని దూరం పెట్టిందని.. దీంతో కొంత కాలం తనతో చనువుగా మాట్లాడిన రమ్య ఇప్పుడు పక్కనపెట్టడాన్ని శశికృష్ణ తట్టుకోలేకపోయాడని పోలీసులు తెలిపారు. ఆమెపై పగ పెంచుకున్న శశికృష్ణ అక్కడితో ఆగకుండా ప్రేమించకపోతే చంపుతానంటూ నిందితుడు నిత్యం బెదిరింపులకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఎన్నిసార్లు చెప్పినా రమ్య ప్రేమ తిరస్కరించింది. దీంతో ఈ కోపంలోనే శశికృష్ణ హత్య చేశాడని నిర్ధారించారు.

అనంతరం ఆత్మహత్యకు ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు పట్టుకొని చికిత్స అందించి రిమాండ్ కు తరలించారు. రమ్య హత్యకు ప్రధాన కారణం సోషల్ మీడియా పరిచయాలేనని డీఐజీ తెలిపారు. ఈ పరిచయాలపై దృష్టి పెట్టాలని కోరారు. యువతులు, మహిళలు సోషల్ మీడియా ఉచ్చులో పడొద్దని కోరారు.మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని కొన్ని నేరాలను పోలీస్ శాఖ నిలువరించలేదని డీఐజీ తెలుపుడం గమనార్హం.

ఇక నిందితుడు శశికృష్ణ బ్యాక్ గ్రౌండ్ కూడా అస్తవ్యస్థంగా ఉంది. అతడి హత్యకు అది కూడా పురిగొల్పింది. రమ్య కూడా ఇలాంటి వ్యక్తి కాబట్టే శశికృష్ణను దూరం పెట్టిందని తెలుస్తోంది. శశికృష్ణ ఆకతాయి , జులాయి అని పోలీసుల విచారణలో తేలింది. శశికృష్ణ చేబ్రోలులో 9వ తరగతి వరకే చదివి మానేశాడు.ఇతడి తల్లిదండ్రులు కుటుంబకలహాలతో వేర్వేరుగా ఉంటున్నారు. అది కూడా శశికృష్ణ ప్రవర్తనను ఇలా క్రూరంగా మార్చి ప్రభావం చూపినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.

శశికృష్ణ తండ్రి గురవయ్య ముట్లూరులో.. తల్లి నరసరావుపేటలో వేర్వేరుగా నివసిస్తున్నారు. శశికృష్ణ ఇద్దరి వద్దకు వెళుతూ ఉంటాడు. ఈ గ్రామాల్లో ఎవరితోనూ మాట్లాడకుండా.. కలవకుండా శశికృష్ణ ముభావంగా ఉంటాడని తేలింది. ఏదైనా అంటే గొడవపడుతుంటాడు. ఆకతాయి చేష్టలతో చిల్లరగా తిరుగుతుంటాడు. శనివారం ఓ ట్రాక్టర్ నుంచి డీజిల్ దొంగిలిస్తుండగా గుర్తించి చేయి చేసుకున్నారని తెలిసింది. మొత్తంగా యువకుడి కుటుంబ నేపథ్యం కూడా అస్తవ్యస్తంగా ఉండడం వల్లే ఇలా తయారయ్యాడని హత్య చేశాడని తెలుస్తోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version