అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు రైట్‌ రైట్‌

తెలుగు రాష్ట్రాల మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న అంతర్రాష్ట్ర బస్సుల సమస్య కొలిక్కి వచ్చింది. రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరిగే సమయం ఆసన్నమైంది. మంగళవారం నుంచి ఆర్టీసీ సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఇరు రాష్ట్రాలు రాజీకి వచ్చి సమస్యను పరిష్కరించుకున్నాయి. 1.61 లక్షల కిలోమీటర్ల మేర బస్సులను తిప్పడానికి ఇరు ఆర్టీసీల మధ్య సోమవారం ఒప్పందం కుదరనుంది. Also Read: టీఆర్‌‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ: రాష్ట్రంలో భీకర […]

Written By: NARESH, Updated On : November 2, 2020 11:54 am
Follow us on

తెలుగు రాష్ట్రాల మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న అంతర్రాష్ట్ర బస్సుల సమస్య కొలిక్కి వచ్చింది. రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరిగే సమయం ఆసన్నమైంది. మంగళవారం నుంచి ఆర్టీసీ సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఇరు రాష్ట్రాలు రాజీకి వచ్చి సమస్యను పరిష్కరించుకున్నాయి. 1.61 లక్షల కిలోమీటర్ల మేర బస్సులను తిప్పడానికి ఇరు ఆర్టీసీల మధ్య సోమవారం ఒప్పందం కుదరనుంది.

Also Read: టీఆర్‌‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ: రాష్ట్రంలో భీకర వాతావరణం

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌‌ ఆఫీసులో రెండు సంస్థల ఎండీలూ మధ్యాహ్నం ఎంవోయూపై సంతకాలు చేయనున్నారు. ఏ రాష్ట్రంలో ఎక్కడెక్కడ బస్సులు నడపాలన్న విషయంపైనా నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఏపీ బస్సులు గతంలో 2.61 లక్షల కిలోమీటర్లు తిరిగేవి. తెలంగాణ మాత్రం ఏపీలో 1.61 లక్షల కిలోమీటర్ల మేర బస్సులను నడిపేది.

ఏపీలో తాము ఎన్ని కిలోమీటర్ల మేర బస్సులు నడుపుతున్నామో.. ఏపీ కూడా ఇక్కడ అంతే కిలోమీటర్లు నడిపించాలని తెలంగాణ ఆర్టీసీ పెట్టిన నిబంధన. దీనికి ఏపీ తాము 50వేల కిలోమీటర్లు తగ్గించుకుంటామని.. ఆ మేరకు తెలంగాణ ఏపీలో అదనంగా 50 వేల కిలోమీటర్లు అధికంగా బస్సులు నడపాలని ప్రతిపాదించింది. తెలంగాణ ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదు. తాము అన్ని కిలోమీటర్లు పెంచి బస్సులు నడపలేమని చెప్పింది. దీంతో ఈ అంశంపై చాలా కాలంగా ప్రతిష్టంభన నెలకొంది. ఎట్టకేలకు ఏపీ తెలంగాణలో 1.61 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడపడానికి అంగీకరించడంతో ఒప్పందానికి రంగం సిద్ధమైంది.

Also Read: చంద్రబాబు ఈసారి కొత్తప్లాన్ వేస్తున్నాడట..

లాక్‌డౌన్‌కు ముందు ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణకు నిత్యం 1,009 సర్వీసులు నడిపేది. ఇప్పుడు ఆ సంఖ్య 638కే పరిమితం కానుంది. టీఎస్‌ఆర్టీసీ గతంలో ఏపీకి 750 సర్వీసులు నడపగా.. ఇప్పుడు 850కి పెరుగనున్నాయి. అయితే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు బస్సుల పర్మిట్లపై గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి.. ఉభయ రాష్ట్రాల రవాణా శాఖల ముఖ్య కార్యదర్శుల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం జరిగేందుకు కొంత సమయం పట్టేలా ఉంది. ఒకవేళ అగ్రిమెంట్‌ తొందరగానే జరిగిపోతే ఈ నైట్‌ నుంచే సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్