https://oktelugu.com/

గ్రేటర్ వార్: పవన్ కల్యాణ్ ను మరోసారి టార్గెట్ చేసిన ఆర్జీవీ.. ఫ్యాన్స్ వార్నింగ్

పవన్ స్టార్ పవన్ కల్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించి ఆ తర్వాత బీజేపీకి మద్దతు ప్రకటించాడు. పవన్ బీజేపీకి మద్దతు ఇవ్వడం నచ్చని ప్రకాశ్ రాజ్ నిన్న పవన్ కల్యాణ్ టార్గెట్ చేసి ఉసరవెల్లి అంటూ మాట్లాడాడు. దీంతో జనసేన నేతలు రంగంలోకి దిగిన ప్రకాశ్ రాజ్ కు కౌంటర్లు ఇస్తుండగా పవన్ ఫ్యాన్స్ ఏకంగా చుక్కలు చూపిస్తున్నారు. Also Read: జీహెచ్ఎంసీ: అన్ని పార్టీల ఆందోళన అదే! తాజాగా రాంగోపాల్ వర్మ సైతం […]

Written By:
  • NARESH
  • , Updated On : November 28, 2020 / 12:28 PM IST

    Shock to RGV .. Court break for ‘Murder’ release

    Follow us on

    పవన్ స్టార్ పవన్ కల్యాణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించి ఆ తర్వాత బీజేపీకి మద్దతు ప్రకటించాడు. పవన్ బీజేపీకి మద్దతు ఇవ్వడం నచ్చని ప్రకాశ్ రాజ్ నిన్న పవన్ కల్యాణ్ టార్గెట్ చేసి ఉసరవెల్లి అంటూ మాట్లాడాడు. దీంతో జనసేన నేతలు రంగంలోకి దిగిన ప్రకాశ్ రాజ్ కు కౌంటర్లు ఇస్తుండగా పవన్ ఫ్యాన్స్ ఏకంగా చుక్కలు చూపిస్తున్నారు.

    Also Read: జీహెచ్ఎంసీ: అన్ని పార్టీల ఆందోళన అదే!

    తాజాగా రాంగోపాల్ వర్మ సైతం పవన్ కల్యాణ్ పై ట్వీటర్లో సైటర్లు వేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. ప్రతీసారి పవర్ స్టార్ ను టార్గెట్ చేసే పబ్లిసిటీ చేసుకునే ఆర్జీవీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ లొల్లి షూరు చేశారు. తనకు రాజకీయాలు పెద్దగా తెలియవంటూనే అతితెలివి చూపిస్తూ పవన్ పై సైటర్లు వేస్తున్నాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ రంగంలోకి దిగి ఆర్జీవీకి గట్టి వార్నింగ్ ఇస్తున్నారు.

    ఇంతకీ పవన్ కల్యాణ్ పై ఆర్జీవీ వేసిన సైటర్ ఏంటంటే.. ‘పవన్ కళ్యాణ్ గొప్ప ఎంటర్టైనర్.. అందుకే నేను రాజకీయాల్లో అతడిని మాత్రమే ఫాలో అవుతాను.. నాకు పవన్ తప్ప రాజకీయాల గురించి ఏమీ తెలీదు’ అంటూ ట్వీట్ చేశాడు. మరో ట్వీట్ లో ‘మొదటి ఎన్నికల్లో పవన్ పోటీ చేయడం.. మరొకటి అదే పోటీ లేకపోవడం’ అంటూ పవన్ పై వర్మ సెటైర్లు వేశారు. ప్రతీ విషయంలోనూ పవన్ ను టార్గెట్ చేస్తూ పబ్లిసిటీ చేసుకునే వర్మకు జీహెచ్ఎంసీ ఎన్నికలు మరోసారి కలిసొచ్చాయి.

    Also Read: ప్రకాశ్ రాజ్ కు మొదలైన సెగ..పనికిమాలినవాడు.. నాగబాబు కౌంటర్..!

    పవన్ జీహెచ్ఎంసీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం వర్మకు ఆయుధంగా మారింది. దీనిని బూచీగా చూపుతూ వర్మ పవన్ పై సైటర్లు వేస్తున్నాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆర్జీవీపై మండిపడుతున్నారు. పవన్ పై ఆర్జీవీ సైటర్లు ఆపాలంటూ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో ఆర్జీవీ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ రచ్చ హాట్ టాపిక్ గా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వారిపై పోలీసులు ఓ వైపు కేసులు నమోదు చేస్తున్న వర్మ మాత్రం ఇవేమీ పట్టనట్లు కాంట్రవర్సీలతో పబ్బం గడుపుకుంటుండటం గమనార్హం.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్