Govt Veterinary Ambulance: పశువుల అంబులెన్స్ కొనుగోలులో అవినీతి మరక..రూ.98 కోట్లు ఏమైనట్టు?

Govt Veterinary Ambulance: పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల వెటర్నరీ అంబులెన్స్ లు ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 175 అంబులెన్స్ లు అందుబాటులోకి తెచ్చారు. సీఎం జగన్ ఆర్భాటంగా ప్రకటించిన తరువాత అవి నియోజకవర్గాలకు చేరుకున్నాయి. నియోజకవర్గ స్థాయిలో వైసీపీ ప్రజాప్రతినిధులు వాటిని మరోసారి జాతికి అంకితం చేశారు. అయితే అంతవరకూ బాగానే ఉంది. కానీ పశువులు కదా పట్టించుకోవనుకున్నారేమో కానీ.. అందులోనూ చేతివాటం ప్రదర్శించారు. రూ.26 […]

Written By: Dharma, Updated On : May 24, 2022 12:53 pm
Follow us on

Govt Veterinary Ambulance: పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల వెటర్నరీ అంబులెన్స్ లు ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 175 అంబులెన్స్ లు అందుబాటులోకి తెచ్చారు. సీఎం జగన్ ఆర్భాటంగా ప్రకటించిన తరువాత అవి నియోజకవర్గాలకు చేరుకున్నాయి. నియోజకవర్గ స్థాయిలో వైసీపీ ప్రజాప్రతినిధులు వాటిని మరోసారి జాతికి అంకితం చేశారు. అయితే అంతవరకూ బాగానే ఉంది. కానీ పశువులు కదా పట్టించుకోవనుకున్నారేమో కానీ.. అందులోనూ చేతివాటం ప్రదర్శించారు. రూ.26 లక్షలకు మించని వాహనాలకు రూ.81.71 లక్షలు రేటు కట్టి మరీ పక్కదారి పట్టించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

Govt Veterinary Ambulance

పశువులకు వైద్య సేవలు అందించే అంబులెన్స్‌లు అంత విలువ చేస్తాయా? అన్నదే ప్రశ్న. అసలు ఆ వాహనం ఖరీదు ఎంత? అందులో ఏయే సదుపాయాలు ఉన్నాయి? వాటిని సమకూర్చడానికి ఎంత ఖర్చు పెట్టారు? అన్న విషయాలను పరిశీలిస్తే మొబైల్‌ వెటర్నరీ అంబులెన్స్‌ల కొనుగోళ్లలో పెద్దఎత్తున అవకతకవలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కొనుగోలు చేసిన ఒక్కో వాహనం ఖరీదు రూ.17 లక్షల లోపే. నిపుణుల అంచనా, మార్కెట్‌ ధరల ప్రకారం అంబులెన్స్‌లో అవసరమెనౖ పరికరాల ఎక్స్‌ట్రా ఫిటింగ్‌కు గరిష్ఠంగా దాదాపు రూ.8.50 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే.. ఒక్కో అంబులెన్స్‌కు మొత్తం దాదాపు 25.50 లక్షలు అవుతుంది. అయితే ఒక్కో వాహనానికి 81.71 లక్షలు ఖర్చు అయినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దీనిపై వాహన రంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్‌ల కొనుగోలు విలువ కంటే ప్రభుత్వం అదనంగా రెండు రెట్లకు పైగా.. అంటే దాదాపు 98 కోట్లు ఎక్కువగా ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ఎక్స్‌ట్రా ఫిటింగ్‌ల పేరుతో అధికంగా ఖర్చయినట్లు ప్రభుత్వం, అధికారులు చూపుతున్నారు. సర్కార్‌ సొమ్ము పెద్దమొత్తంలో చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంబులెన్స్‌ల కొనుగోలు వ్యవహారంలో ఓ ఉన్నతాధికారి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది.

Also Read: KCR- National Politics: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ రాణిస్తారా?

108 తరహాలో పశువులకూ వైద్య సేవలు అందిస్తామని.. ఇందుకు రూ.278 కోట్లతో 340 అంబులెన్స్‌లను కొనుగోలు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 పశువుల అంబులెన్స్‌లను రూ.143 కోట్లతో కొనుగోలు చేసింది. ఈ నెల 19న ముఖ్యమంత్రి జగన్‌ జెండా ఊపి వీటిని ప్రారంభించారు. జగన్‌ సర్కార్‌ కొనుగోలు చేసిన ఈ అంబులెన్స్‌లు ఎక్కువగా ‘టాటా ఆల్ర్టా టీ7’ మోడల్‌వి. బాడీ ఆటోను తలపించే ఆల్ర్టా టీ7 వాహనం ఖరీదు రూ.14.77 లక్షల నుంచి రూ.16.35 లక్షలు. కొన్ని వాహనాలు ఇతర మోడల్‌వి ఉన్నాయి.

Govt Veterinary Ambulance

ఏ వాహనాలైనా ధర 17 లక్షలకు లోపు ఉంది. కేబిన్‌కు రెండు చక్రాలు, బాడీకి నాలుగు చక్రాలతో అంబులెన్స్‌లను తయారు చేయించారు. అంబులెన్స్‌లోకి పశువుల్ని ఎక్కించడానికి హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. లోపల పశువుల మందుల భద్రత కోసం ఒక ఫ్రిజ్‌, సిబ్బంది కోసం ఏసీ ఉన్నాయి. చిన్నపాటి మూగజీవాలు, పక్షులను పరీక్షించడానికి స్ట్రెచర్‌, ఇతర పరికరాలను అమర్చారు. పశువుల పేడ, రక్త పరీక్షలకు మైక్రోస్కోప్‌ వంటి ప్రయోగ పరికరాలు ఏర్పాటు చేశారు. కొన్ని రకాల మందులు అందుబాటులో ఉంచారు. మార్కెట్‌ ధరల ప్రకారం అంబులెన్స్‌లోని పరికరాల విలువ గరిష్ఠంగా రూ.8.50 లక్షలు ఉంటుంది. 108 వాహనాలకు పరికరాలను సమకూర్చిన సంస్థే వెటర్నరీ అంబులెన్స్‌లకు కూడా పరికరాలను ఏర్పాటు చేసినట్టు సమాచారం. అయితే దీనిపై రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి అప్పలరాజు మాత్రం ఖండిస్తున్నారు. అసలు అవకతవకలకు ఆస్కారమే లేదని తేల్చిచెబుతున్నారు.

Also Read:KCR Returned From Delhi: మోడీ దెబ్బకు కేసీఆర్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్.. అసలు కారణమిదే?
Recommended videos


Tags