Vijay Sai Reddy Impress Delhi BJP: బీజేపీ అగ్ర నాయకత్వం ప్రాపకం కోసం పరితపిస్తున్న విజయసాయిరెడ్డి

Vijay Sai Reddy Impress Delhi BJP: విజయసాయిరెడ్డి.. వైసీపీలో కీలక నేత. అధినేత తరువాత ఆ పార్టీలో ముందు వరుసలో ఉండే నాయకుడు. కానీ ఆయన చేష్టలు భిన్నం. ఆయనెప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ప్రధానంగా ట్విట్టర్ లో ఆయన ఖాతా ఎప్పుడూ ఆన్ లైన్ లో ఉంటుంది. కానీ ఆయన పార్టీ విధానాలు, ప్రభుత్వం చేసే గొప్పలేవీ ఉండవు. ఒకటి బీజేపీ, మోదీ విధానాలపై ప్రశంసల వర్షం, రెండూ టీడీపీ అధినేత […]

Written By: Dharma, Updated On : May 24, 2022 12:57 pm
Follow us on

Vijay Sai Reddy Impress Delhi BJP: విజయసాయిరెడ్డి.. వైసీపీలో కీలక నేత. అధినేత తరువాత ఆ పార్టీలో ముందు వరుసలో ఉండే నాయకుడు. కానీ ఆయన చేష్టలు భిన్నం. ఆయనెప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ప్రధానంగా ట్విట్టర్ లో ఆయన ఖాతా ఎప్పుడూ ఆన్ లైన్ లో ఉంటుంది. కానీ ఆయన పార్టీ విధానాలు, ప్రభుత్వం చేసే గొప్పలేవీ ఉండవు. ఒకటి బీజేపీ, మోదీ విధానాలపై ప్రశంసల వర్షం, రెండూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై వ్యక్తిగతంగా తూలనాడడానికి ట్విట్టర్ ను వేదికగా చేసుకుంటారు. పనిలో పనిగా బీజేపీకి వ్యతిరేకమైన కాంగ్రెస్, యువనేత రాహుల్ గాంధీపై కూడా విరుచుకుపడుతుంటారు. ప్రధాని మోదీ ఏంచేసినా ఆహా ఓహో అంటూ కీర్తిస్తుంటారు. రోజువారీగా తాను చేస్తున్న ట్వీట్లలో కొన్ని సీ గ్రేడ్ సోషల్ మీడియా కార్యకర్తలు చేసే మార్ఫింగ్ పోస్టులు ఉంటూండగా.. మిగతావి మాత్రం కేంద్రాన్ని.. కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించేవి ఉంటున్నాయి. అదే సమయంలో బీజేపీ రాజకీయ ఎజెండాను మోసే టాపిక్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ ట్విట్ల వెనుక ఆయన కేంద్ర పెద్దల ద్రుష్టిలో పడాలన్న ఆరాటం మాత్రం కనిపిస్తోంది. అందుకే ఆయన ట్విట్లన్నీ ఇంగ్లీష్ లోనే చేస్తుండడం విశేషం.

Vijayasai Reddy

తమ పార్టీ విధానాలు కానీ.. చేసే పనుల గురించి కానీ విజయసాయిరెడ్డి ట్విట్లు చేయరు. పూర్తిగా టీడీపీని, చంద్రబాబును… లోకేష్‌ను వ్యక్తిగతంగా విమర్శలే ఉంటాయి. బీజేపీని ఎట్రాక్ట్ చేయడానికీఅదే విధానం ఎంచుకున్నారు. ఆయన ట్వీట్లు చూసిన చాలా మంది.. ఆయన బీజేపీనా.. వైసీపీయా అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తుంటారు. దీనిపై వైసీపీలోనే భిన్న వాదనలు వినిపిస్తుంటాయి. అధినేత ఇచ్చిన టాస్కులో భాగంగా ఆయన వ్యవహరిస్తుంటారని.. అందులో ఆయన తప్పేమీ లేదని వ్యాఖ్యానిస్తుంటారు. అయితే ఆయన పోస్టులకు ఒకటి రెండు కూడా పాజిటవ్ కామెంట్స్ రావు. ఎవరూ స్పందించరు కూడా. అది వేరే సంగతి. ఆయన బ్లాక్ చేయగలిగిన వారినందర్నీ బ్లాక్ చేశారు. దాదాపు కార్నర్ చేసేశారు. చివరకు బండ్ల గణేష్ లాంటి వారిని కూడా ఫేస్ చేశారు. అందుకే ఇంకా చేయడం ఎందుకని ఆగిపోయినట్లుగా ఉన్నారు.

Also Read: Govt Veterinary Ambulance: పశువుల అంబులెన్స్ కొనుగోలులో అవినీతి మరక..రూ.98 కోట్లు ఏమైనట్టు?

Vijayasai Reddy

అయితే విజయసాయిరెడ్డి చేసే ట్వీట్లకు టీడీపీ నేతలు కౌంటర్ ట్వీట్లు ప్రారంభించారు. నీవు నేర్పిన విద్యేనని ఆయన ఏ టాపిక్ మీద టీడీపీని విమర్శిస్తారో… అదే టాపిక్ మీద అంత కంటే దారుణంగా తమ ట్విట్లు పెడుతుంటారు. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దానిని డైవర్ట్ చేయడానికి విజయసాయి ట్విట్లు పెడుతుంటారని.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారన్న అపవాదు ఉంది. తాను ట్విట్లు పెట్టడంతో పాటు తమ నేతల్ని అనిపించడంలోనూ విజయసాయిరెడ్డి ముందు ఉంటారన్న సెటైర్లు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. అయితే కేంద్రంలో ఉన్న బీజేపీ అగ్రనేతల ప్రాపకం కోసం గత దశాబ్ద కాలంగా నిరంతర ప్రయత్నంలో ఉంటున్నారు.

Also Read:KCR- National Politics: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ రాణిస్తారా?
Recommended videos


Tags