ఏపీలో ఇప్పుడిక బదిలీల ‘పంచాయతీ’

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభం అయినప్పటి నుంచి రోజుకో అంశం తెరపైకి వస్తోంది. ఎన్నికలు వద్దంటూ ప్రభుత్వం.. నిర్వహిస్తానంటూ.. ఎస్ఈసీ పట్టుతో ముందుకు సాగగా.. సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నికలకు తలవంచింది జగన్ సర్కారు. తరువాత వివిధ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులను చెప్పకుండానే బదిలీ చేయడం వివాదాస్పదం అవుతోంది. మరో వైపు ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రాకుంటే.. చర్యలు తప్పవని […]

Written By: Srinivas, Updated On : February 8, 2021 4:06 pm
Follow us on


ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభం అయినప్పటి నుంచి రోజుకో అంశం తెరపైకి వస్తోంది. ఎన్నికలు వద్దంటూ ప్రభుత్వం.. నిర్వహిస్తానంటూ.. ఎస్ఈసీ పట్టుతో ముందుకు సాగగా.. సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నికలకు తలవంచింది జగన్ సర్కారు. తరువాత వివిధ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులను చెప్పకుండానే బదిలీ చేయడం వివాదాస్పదం అవుతోంది. మరో వైపు ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రాకుంటే.. చర్యలు తప్పవని వైసీపీ నేతలు.. బహిరంగంగానే బెదిరిస్తున్నారు. ఈ క్రమంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉద్యోగులకు భరోసా నింపే ప్రయత్నం చేశారు. రాజ్యాంగ రక్షణ అందరికీ ఉంటుందని.. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారిపై చర్యలు తీసుకునే అవకాశం వారికి లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో కారణం లేకుండానే అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తోంది.

Also Read: చంద్రబాబు ‘పంచాయతీ’ ప్లాన్లు.. మామూలుగా లేవుగా!

ఇటీవల ఏపీ సర్కారు కొంతమంది రిటర్నింగు ఆఫీసర్లు, పరిశీలకులను బదిలీ చేసింది. ఆ జాబితాను సేకరించిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రభుత్వానికి లేఖ రాశారు. బదిలీ చేసిన వారందరినీ.. పాతస్థానంలోనే మళ్లీ పోస్టింగు ఇవ్వాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని నేరుగా చెప్పేశారు. అయితే ప్రభుత్వం కిందిస్థాయి అధికారులనే కాదు.. ఐఏఎస్ అధికారులను కూడా బదిలీ చేస్తోంది. నెల్లూరు జిల్లా పరిశీలకుడిగి ఉన్న బసంత్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి టీటీడీ జేఈవో గా ఉన్నారు. ఆయనను ప్రభత్వం బదిలీ చేసింది. పోస్టింగు ఇవ్వకుండానే పక్కన పెట్టేసింది. దీనికి కారణంగా నిమ్మగడ్డ తిరుమల పర్యటనలో ఆయన పాల్గొనడమే.

Also Read: నిమ్మగడ్డకు సడెన్ గా తీవ్ర అస్వస్థత.. కడప టూర్ క్యాన్సిల్.. ఏమైంది?

ఇక ఇతర ఆఫీసర్లపై కూడా వైసీపీ నేతలు ఒత్తిడి పెంచుతున్నారు. తాము చెప్పినట్లు వినకుంటే బదిలీ చేస్తామని బెదిరిస్తున్నారు. ఇవన్నీ గట్టుగా సాగుతున్నాయి. ఈ విషయం ఎస్ఈసీ దృష్టికి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగారు. నిబంధనల ప్రకారం.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎవరినీ బదిలీ చేయవద్దు. తప్పని సరి అయితే కారణం చెప్పాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం ఎలాంటి కారణం లేకుండానే బదిలీ చేస్తోంది. ఈ వ్యవహారాన్ని అడ్డుకోకుటే.. తాము ఎన్నికలు నిర్వహించడం కష్టమేనని అధికారులు అంటున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

ఐఏఎస్ అధికారి బసంత్ కుమార్ కు నిజాయితీ పరుడని పేరుంది. ఆయన ఇప్పుడు కీలక పోస్టులో లేరు. కానీ ఆయన తన ఇంట్లో పెళ్లిళ్లను వందల రూపాయలతోనే చేస్తుంటారు. ఆడంబరలకు పోరు. మచ్చలేని అధికారిగా మంచి పేరు ఉంది. అయితే ఆయనపై ప్రభుత్వం చర్య తీసుకోవడంపై అధికార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.