కేసీఆర్ పై గవర్నర్ సీరియస్.. ఎందుకంటే?

తెలంగాణలో కరోనా మహామ్మరి పంజా విసురుతోంది. కరోనాను కట్టడి చేయడంలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని తెలంగాణ తొలి ప్రథమరాలు సుందరాజన్ తమిళ సై విమర్శించడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవర్నర్ తమిళ సై తెలంగాణ సర్కారుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణకు గవర్నర్ హోదా ఉన్నప్పటికీ తానొక వైద్యురాలిగా కరోనాపై ప్రభుత్వానికి పలు సూచనలు చేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు. మూడునెలల క్రితమే సీఎం కేసీఆర్ […]

Written By: Neelambaram, Updated On : August 19, 2020 1:14 pm
Follow us on


తెలంగాణలో కరోనా మహామ్మరి పంజా విసురుతోంది. కరోనాను కట్టడి చేయడంలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని తెలంగాణ తొలి ప్రథమరాలు సుందరాజన్ తమిళ సై విమర్శించడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవర్నర్ తమిళ సై తెలంగాణ సర్కారుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణకు గవర్నర్ హోదా ఉన్నప్పటికీ తానొక వైద్యురాలిగా కరోనాపై ప్రభుత్వానికి పలు సూచనలు చేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు. మూడునెలల క్రితమే సీఎం కేసీఆర్ తో కరోనా కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాలను వివరించానని చెప్పారు.

Also Read: కెసిఆర్ గారూ, ప్రజల జీవితాలతో చెలగాటమాడకండి

అయితే ప్రభుత్వం మాత్రం పెడచెవిన పెట్టడం వల్లే తెలంగాణలో కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణమని ఆమె స్పష్టం చేశారు. మెడికల్ హాబ్ గా.. ఫార్మా హాబ్ గా ఉన్న తెలంగాణ కరోనా విషయంలో ముందే మెల్కొని దేశానికి ఆదర్శంగా ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న వేళ తానొక వైద్యురాలిగా.. సామాన్య ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వానికి కీలక సూచనలు చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ మాత్రం తన సూచనలు వేరేలా తీసుకొని పెడచెవిన పెట్టడంతో కేసుల సంఖ్య పెరిగిందని సీరియస్ అయ్యారు.

కరోనా తొలిదశలోనే ఉన్నప్పుడే తాను జిల్లాస్థాయిలో టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాడంతోపాటు చికిత్సకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అప్పట్లోనే సూచించానని గుర్తుచేశారు. కంటోన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయడం, వైరస్ కేసులు ఎక్కువ ఉన్నచోట మొబైల్ టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించినా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోయాయన్నారు. మూడునెలలు క్రితమే సీఎం కేసీఆర్ కు సూచిస్తే ప్రభుత్వం ఇప్పుడు మేల్కొందన్నారు. ఇప్పుడిప్పుడు టెస్టుల సంఖ్య పెంచున్నారని తాను సూచించినపుడే చర్యలు చేపడితే తెలంగాణలో కరోనా ఇప్పటికే కట్టడి అయ్యేదన్నారు.

Also Read: తెలిసిందిగా.. కేటీఆరే వర్కింగ్ సీఎం అన్నట్టు?

తొలిరోజుల్లో గాంధీ ఆసుపత్రి మాత్రమే కరోనా కోసం ఉండేదన్నారు. దీంతో తొలినాళ్లలో వివిధ జిల్లాల నుంచి రోగులు ఇక్కడి వచ్చేవారని తెలిపారు. ప్రభుత్వా ఆస్పత్రుల్లో మౌలిక సౌకర్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉందని.. బెడ్‌ల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది లేరన్నారు. వైద్య సిబ్బందిపై ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు ఆచరణలో పొంతలేదని స్పష్టం చేశారు. మరింత మంది వైద్యులను నియమించుకోవాల్సిన అవసరాన్ని గవర్నర్ గుర్తుచేశారు. ఆస్పత్రుల్లో బెడ్స్ మాత్రమే ఉంటే ప్రయోజనం ఏమిలేదని తగిన వైద్య సిబ్బంది ఉంటేనే కరోనాను కట్టడి చేయగలమని అన్నారు.

ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. మొత్తానికి గవర్నర్ తమిళసై కరోనా విషయంలో కేసీఆర్ ను మరోసారి ఇరుకున పెట్టడం ఆసక్తిని రేపుతోంది.