https://oktelugu.com/

AP Schools: ఏపీలో స్కూళ్ల సెలవులపై ప్రభుత్వం కీలక ప్రకటన

AP Schools: తెలంగాణలో స్కూళ్లకు ఈనెల 30వరకూ సెలవులు పొడిగించింది కేసీఆర్ సర్కార్. కరోనా మహమ్మారి కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రోజుకు 2వేల లోపు కేసులు పెరుగుతున్న పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఏపీలో కరోనా విస్పోటం కలుగుతున్నా అక్కడి ప్రభుత్వం పాఠశాలల సెలవులను పొడిగించకుండా తెరవడం చర్చనీయాంశమైంది. ఏపీలో కరోనా కల్లోలం చోటుచేసుకుంటోంది. ఏకంగా రోజుకు 5వేల వరకూ కేసులు నమోదవుతున్నాయి. చిత్తూరు, విశాఖ […]

Written By: NARESH, Updated On : January 16, 2022 4:49 pm
Follow us on

AP Schools: తెలంగాణలో స్కూళ్లకు ఈనెల 30వరకూ సెలవులు పొడిగించింది కేసీఆర్ సర్కార్. కరోనా మహమ్మారి కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రోజుకు 2వేల లోపు కేసులు పెరుగుతున్న పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఏపీలో కరోనా విస్పోటం కలుగుతున్నా అక్కడి ప్రభుత్వం పాఠశాలల సెలవులను పొడిగించకుండా తెరవడం చర్చనీయాంశమైంది.

ఏపీలో కరోనా కల్లోలం చోటుచేసుకుంటోంది. ఏకంగా రోజుకు 5వేల వరకూ కేసులు నమోదవుతున్నాయి. చిత్తూరు, విశాఖ , తూర్పు గోదావరి జిల్లాల్లో అయితే ఏకంగా రోజుకు 1000 వరకూ కేసులు బయటపడుతున్నాయి. అయితే కోవిడ్ కేసులు ఇంత భారీగా పెరుగుతున్నా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం స్కూళ్లకు సెలవులు పొడగించకుండా షాకిచ్చింది.

తెలంగాణలో లాగానే ఏపీలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న వేళ జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణలో లాగా ఏపీలో కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించే ఆలోచన ఉందా? అని విలేకరులు ప్రశ్నించగా.. అలాంటి ఆలోచన లేదని.. స్కూళ్లు యథావిధిగా నడుస్తాయని మంత్రి సురేష్ కుండబద్దలు కొట్టారు.

ఏపీలో రోజుకు 5వేల వరకూ కేసులు నమోదవుతున్నాయి. విద్యార్థుల భద్రత, భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న వేళ ఏపీ సర్కార్ నిర్ణయం శరాఘాతంగా మారింది. మరి దీనిపై తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఎలా స్పందిస్తారన్నది వేచిచూడాలి.