MP Gorantla Madhav Issue: ఏపీలో డర్టీ పిక్చర్ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అది ఫేక్ వీడియో అని తేల్చడానికి ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. ఎంపీని కాపాడే ప్రయత్నంలో సరికొత్త సందేహాలను తెరలేపుతోంది. అటు విపక్షం టీడీపీ వివాదాన్ని మరింత రాజేస్తుండగా.. ప్రభుత్వం కూడా తప్పటడుగులు వేస్తోంది. జనం మరిచిపోవాలని ప్రయత్నిస్తున్నా.. మేము మరవనివ్వమన్నట్టు ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది. తాజాగా ఈ అంశంపై సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ స్పందించారు.అనూహ్యంగా మీడియా ముందుకొచ్చారు.న్యూడ్ వీడియో నిజమైనదే అని టీడీపీ అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెనిక్స్ ల్యాబ్ ఇచ్చిన నివేదికను బయటపెట్టింది. అయితే ఆ నివేదిక ఫేక్ గా సునీల్ కుమార్ తేల్చేశారు.రిపోర్టు నిజం కాదని అమెరికాలోని సంబంధిత ల్యాబ్ ప్రతినిధులు తమకు సమాచారమిచ్చినట్టు చెప్పుకొచ్చారు.నిజానిజాలు తెలుసుకునేందుకు తాము సంస్థ ప్రతినిధులకు మెయిల్ చేశామని.. వారు ఆ నివేదిక తాము ఇచ్చినది కాదని తేల్చారని సునీల్ కుమార్ చెబుతున్నారు. అయితే ఆ సంస్థ ప్రతినిధులు వీడియో నిజమేనని.. రిపోర్టు మాత్రం తామిచ్చినది కాదని చెప్పారని ప్రచారం సాగుతోంది. సీఐడీ అదనపు డీజీ మాత్రం తమకు పనికొచ్చే అంశాలను మాత్రమే బయట పెట్టారన్న టాక్ నడుస్తోంది.

ఎస్పీ ప్రకటనతో సుఖాంతం..
ఇప్పటికే ఈ వీడియోపై అనంతపురం ఎంపీ పకీరప్ప స్పందించారు. వీడియోను మరో సెల్ లో రికార్డు చేశారు కాబట్టి..ఆ వీడియో ఒరిజినల్ కాదని..ఒరిజినల్ దొరికితే కానీ ఫోరెనిక్స్ ల్యాబ్ కు పంపించలేమని కూడా చెప్పేశారు.కథకు కొంతవరకూ సుఖాంతం చెప్పారు. కానీ అమెరికాలో స్థిరపడిన ఓ ప్రవసాంధ్రుడు న్యూడ్ వీడియోను ఎప్లిక్స్ ఫోరెనిక్స్ ల్యాబ్ కు పంపించారు. అసలుదా? లేక పేకా? అని తేల్చాలని కోరారు. అయితే సదరు సంస్థ మాత్రం ఇది ఒరిజినల్ గా తేల్చింది.ఎటువంటి ఎడిటింగ్ చేయలేదని నిర్థారించింది. దీంతో అప్పటివరకూ మాధవ్ ను వెనుకొసుకొచ్చిన పోలీస్ శాఖ ఇరకాటంలో పడింది. అటు వైసీపీ నేతలు కూడా ఆందోళనకు గురయ్యారు. దీంతో ఈ వ్యవహారం తేల్చాలని ప్రభుత్వ పెద్దలు సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ ను ఆదేశించారు. దీంతో ఆయన ఎంటరయ్యారు.

తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో..
అయితే ప్రభుత్వ పెద్దలు ఏం ఆదేశించారో ఏమో కానీ.. డీజీ సునీల్ కుమార్ మాత్రం ఈ అంశంపై గట్టిగానే మాట్లాడారు. వ్యూహాత్మకంగా వ్యవహరించారు.ఏపీలో మీ పేరుతో ఓ రిపోర్టు హల్ చల్ చేస్తోందని.. దానిపై వివరణ ఇవ్వాలని ఎప్లిక్స్ ఫోరెనిక్స్ ల్యాబ్ ప్రతినిధులకు ఈ మెయిల్ చేసినట్టు చెబుతున్నారు. అయితే అక్కడ నుంచి వీడియో ఒరిజినల్ అని..ఎటువంటి ఎడిట్ చేయలేదని..అలాగని తాము రిపోర్టు అంటూ ఏమీ ఇవ్వలేదని సదరు సంస్థ ప్రతినిధులు తిరిగి మెయిల్ చేశారు. కానీ ఇందులో తమకు అనుకూలమైన అంశాలను మాత్రమే ఏడీజీ సునీల్ కుమార్ ప్రస్తావించారు. ఆ రిపోర్టు తాము ఇవ్వలేదన్న అంశాన్నే హైలెట్ చేసి చూపించారు.ఒక ఫోన్ లో ప్లే అవుతున్న దృశ్యాలను మరో ఫోన్ లో రికార్డుచేసి తమకు పంపించారని.. తద్వారా అది అసలుదో ఫేక్ అని చెప్పలేమని కూడా సదరు సంస్థ ప్రతినిధులు మెయిల్ లో పేర్కొన్నట్టు చెబుతున్నారు.మాకు అందిన వీడియో అసలైనదేనని సదరు సంస్థ ప్రతినిధులు స్పష్టంగా చెప్పినా.. ఆ నివేదిక ఫేక్ అంటూ సునీల్ కుమార్ వక్రభాష్యం చెబుతున్నారు. మొత్తానికైతే డర్టీ పిక్చర్ నుంచి ఎంపీ గోరంట్ల మాధవ్ ను బయటపడేసేందుకు ఏపీ సర్కారు అన్ని వ్యవస్థలను వాడేస్తుందన్న విమర్శ అయితే మూట గట్టుకుంటోంది.
[…] Also Read: MP Gorantla Madhav Issue: ఏపీలో ‘న్యూడ్’ మంటలు..డర్డీ … […]
[…] Also Read:MP Gorantla Madhav Issue: ఏపీలో ‘న్యూడ్’ మంటలు..డర్డీ … […]