https://oktelugu.com/

మద్యం ప్రియులకు శుభవార్తలో చేదు న్యూస్!

“మూలిగే నక్క మీద తటికాయ పడ్డట్లు” అసలే కరోనా దెబ్బతో లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం దొరకక మందుబాబుల కష్టాలు మిన్నంటిన వేళ మరో పిడుగులాంటి వార్త ఏపీ మద్యం ప్రియులను కంగారు పెడుతుంది.ఆంధ్రా లో మరోసారి మద్యం ధరలు పెరుగుతున్నాయి. గతంలో ఉన్న మద్యం ధరలకంటే మరో 25 శాతం పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలు జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే రానున్న రోజుల్లో ఏపీలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 4, 2020 / 09:07 AM IST
    Follow us on

    “మూలిగే నక్క మీద తటికాయ పడ్డట్లు” అసలే కరోనా దెబ్బతో లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం దొరకక మందుబాబుల కష్టాలు మిన్నంటిన వేళ మరో పిడుగులాంటి వార్త ఏపీ మద్యం ప్రియులను కంగారు పెడుతుంది.ఆంధ్రా లో మరోసారి మద్యం ధరలు పెరుగుతున్నాయి. గతంలో ఉన్న మద్యం ధరలకంటే మరో 25 శాతం పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలు జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

    అలాగే రానున్న రోజుల్లో ఏపీలో మరిన్ని మద్యం దుకాణాల సంఖ్య తగ్గించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 4 నుంచి మద్యం దుకాణాలు తెరచుకోనున్నాయి. కోవిడ్‌ కంటైన్‌ మెంట్‌ ఏరియాలు లేని గ్రీన్, ఆరెంజ్‌ జోన్లతోపాటు రెడ్‌ జోన్లలోనూ మద్యం విక్రయాలు జరుపుకోవచ్చని కేంద్రం తెలిపింది. అయితే, ఇందుకు కొన్ని పరిమితులు విధించింది. విక్రయాల సమయంలో దుకాణం వద్ద కొనుగోలు దారులు భౌతిక దూరం(ఆరడుగుల ఎడం) పాటించాలి. అయిదుగురికి మించి దుకాణం వద్ద ఉండరాదు. మార్కెట్‌ ఏరియాల్లో ఉన్న మద్యం దుకాణాలు, రెడ్‌ జోన్లలోని మాల్స్‌ లో ఉన్న వాటికి ఈ వెసులుబాటు వర్తించదు.

    ధరలు పెంచినా పర్వాలేదు మద్యం దొరికితే చాలు అనుకునే మందుబాబులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. వారందరు మద్యం షాపుల సడలింపుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పేద, మధ్య తరగతి మద్యం ప్రియులకు ఈ ధరల పెంపు మింగుడుపడని అంశం.