https://oktelugu.com/

IOCL Recruitment : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 246 పోస్టులు, లక్షల్లో జీతం.. పైగా గడువు కూడా పొడిగించారు..త్వర పడండి

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 246 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు గతంలోనే ఓ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నోటిఫికేషన్ కు సంబంధించిన గడువును పొడిగించింది.

Written By: , Updated On : February 22, 2025 / 04:18 PM IST
IOCL Recruitment

IOCL Recruitment

Follow us on

IOCL Recruitment : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 246 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు గతంలోనే ఓ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నోటిఫికేషన్ కు సంబంధించిన గడువును పొడిగించింది. ఫిబ్రవరి 23తో ముగియాల్సిన దరఖాస్తు గడువును మరో 5 రోజులపాటు పొడిగించి ఫిబ్రవరి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని IOCL ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఈ భర్తీకి సంబంధించిన పోస్టులు:
* జూనియర్ ఆపరేటర్: 215
* జూనియర్ అటెండెంట్: 23
* జూనియర్ బిజినెస్ అసిస్టెంట్: 8

వేతనం:
ఈ పోస్టులకు నియమితులుగా ఉన్న వారికి నెలకు రూ. 23,000 నుండి రూ. 1,05,000 మధ్య జీతం అందుతుంది.

విద్యార్హత, వయోపరిమితి:
* దరఖాస్తు చేసే అభ్యర్థులు తమ విద్యార్హతలు, వయోపరిమితులను అధికారిక నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.
* కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు
* గరిష్ట వయోపరిమితి: 26 సంవత్సరాలు (31-01-2025 నాటికి)

దరఖాస్తు ఫీజు:
* అభ్యర్థులకు రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది.
* ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంటుంది.
* ఫీజు డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డులు/మొబైల్ వ్యాలెట్ల ద్వారా చెల్లించవచ్చు.

దరఖాస్తు చేయు విధానం :
* ముందుగా అధికారిక వెబ్‌సైట్ iocl.comకి వెళ్లాలి.
* హోమ్‌పేజీలో ఉన్న రిక్రూట్‌మెంట్(Recruitment) లింక్‌పై క్లిక్ చేయండి.
* అప్లై ఆన్ లైన్(Apply online) అనే లింక్‌పై క్లిక్ చేయండి.
* రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేసి మీ ఖాతాలోకి లాగిన్ అవ్వండి.
* దరఖాస్తు ఫారమ్ నింపి అవసరమైన దరఖాస్తు రుసుం చెల్లించండి.
* తరువాత అవసరాల కోసం దరఖాస్తును సేవ్ చేసి ప్రింటవుట్ తీసుకోండి.

ఈ ఉద్యోగాలపై మరిన్ని వివరాలకు IOCL అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.