తెలంగాణ పీజీ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త.?

కరోనా వైరస్, లాక్ డౌన్ దేశంలోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. కరోనా, లాక్ డౌన్ వల్ల ఇతర ప్రాంతాల్లో చదివే చాలామంది విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇలా వెళ్లిపోయిన పరీక్షలకు హాజరు కావాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఆరు యూనివర్సిటీలు తెలంగాణ పీజీ విద్యార్థులకు శుభవార్త చెప్పాయి. ఆరు యూనివర్సిటీలు విద్యార్థులు సొంత ఊర్లలోనే పరీక్షలను రాసే అవకాశం కల్పిస్తున్నాయి. పీజీ కన్వెన్షనల్ కోర్సుల్లో చివరి […]

Written By: Kusuma Aggunna, Updated On : October 16, 2020 9:02 am
Follow us on

కరోనా వైరస్, లాక్ డౌన్ దేశంలోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. కరోనా, లాక్ డౌన్ వల్ల ఇతర ప్రాంతాల్లో చదివే చాలామంది విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇలా వెళ్లిపోయిన పరీక్షలకు హాజరు కావాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఆరు యూనివర్సిటీలు తెలంగాణ పీజీ విద్యార్థులకు శుభవార్త చెప్పాయి.

ఆరు యూనివర్సిటీలు విద్యార్థులు సొంత ఊర్లలోనే పరీక్షలను రాసే అవకాశం కల్పిస్తున్నాయి. పీజీ కన్వెన్షనల్ కోర్సుల్లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు సొంత ఊర్లలోనే పరీక్షలు రాసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 19 నుంచి పరీక్షలు మొదలుకానున్నాయి. మిగిలిన యూనివర్సిటీల్లో ఈ నెల చివరి వారం నుంచి పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

కరోనా వైరస్ వల్ల రాష్ట్రంలోని హాస్టళ్లను ఇప్పట్లో తెరిచే పరిస్థితులు కనిపించడం లేదు. దూరప్రాంతాలకు వెళ్లి పరీక్షలు రాయాలన్నా సరైన రవాణా సౌకర్యాలు లేవు. దీంతో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల అధికారులు మిగతా యూనివర్సిటీల అధికారులతో చర్చించి విద్యార్థులు సొంతూళ్లలోనే పరీక్షలు రాసే విధంగా చర్యలు చేపట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే 80 పరీక్షా కేంద్రాలకు అదనంగా ఆరు సెంటర్లను పెంచింది.

యూనివర్సిటీలు తీసుకున్న నిర్ణయం వల్ల తమకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని విద్యార్థులు చెబుతుండటం గమనార్హం. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి కోసం చేపడుతున్న చర్యలు కేసులు తగ్గుముఖం పట్టడానికి కారణమవుతున్నాయి.