కరోనా సోకిన ముస్లింలకు గుడ్ న్యూస్..

ముస్లింలకు చాలా పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. ఈ నెలలో ముస్లింలు నెలరోజులపాటు కఠోర ఉపవాస దీక్ష చేస్తుంటారు. ఈమేరకు గాంధీలోని ముస్లిం కరోనా రోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. శనివారం నుంచే ముస్లిం కరోనా రోగులకు ప్రత్యేక మెనూ అందించేందుకు ప్రభుత్వం సన్నహాలు చేసింది. షెహరి, ఇఫ్తార్ విందులో వారికి వెజ్, నాన్ వెజ్ తో కూడిన భోజనాన్ని అందించనున్నారు. ఇందుకోసం ఒక్కొక్కరికి రోజుకు రూ.500 ఖర్చు చేయనున్నారని సమాచారం. గాంధీలోని ముస్లిమేతర కరోనా […]

Written By: Neelambaram, Updated On : April 25, 2020 2:27 pm
Follow us on


ముస్లింలకు చాలా పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. ఈ నెలలో ముస్లింలు నెలరోజులపాటు కఠోర ఉపవాస దీక్ష చేస్తుంటారు. ఈమేరకు గాంధీలోని ముస్లిం కరోనా రోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. శనివారం నుంచే ముస్లిం కరోనా రోగులకు ప్రత్యేక మెనూ అందించేందుకు ప్రభుత్వం సన్నహాలు చేసింది. షెహరి, ఇఫ్తార్ విందులో వారికి వెజ్, నాన్ వెజ్ తో కూడిన భోజనాన్ని అందించనున్నారు. ఇందుకోసం ఒక్కొక్కరికి రోజుకు రూ.500 ఖర్చు చేయనున్నారని సమాచారం.

గాంధీలోని ముస్లిమేతర కరోనా పేషంట్లను వేరే గదిలోకి తరలించేందుకు వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముస్లింలకు నమాజ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముస్లింలకు శనివారం ఉదయం నుంచే ప్రత్యేక మెనూ ప్రారంభంకానుంది. ఉదయం3.30గంటలకు షెహరిలో రోటీ, వెజ్ కర్రీ, పప్పు, అన్నం అందించనున్నారు. అలాగే సాయంత్రం 7.30 గంటలకు ఇఫ్తార్‌లో కిచిడి, టమోటా చట్నీ, చికెన్ ఫ్రై, బగారా, దాల్చా, వెజ్ బిర్యానీ అందించనున్నారు. ఇక షెహరీలో భాగంగా రోజు విడిచి రోజు మటన్, ఇఫ్తార్‌లో రోజు విడిచి రోజు చికెన్ బిర్యానీ, గుడ్డు, అన్నం, వెజ్ కర్రీ అందించనున్నారు. ఇక ఉదయం సాయంత్రం టీ, పాలు అందించనున్నారు. అల్ఫాహారంగా ఖర్జూరం, అరటిపండ్లు, ఇతర పండ్లను అందించేందుకు గాంధీ ఆస్పత్రి వైద్యాధికారులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.