Gone Prakash Rao: వైసీపీలో గోనె ప్రకాశరావు మంటలు.. వెనుక ఆ కీలక నేత

కాశరావు  జగన్ పరిపాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. టీడీపీ, జనసేన కలిస్తే్ 150 సీట్లు వస్తాయని .. టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా 100 సీట్లు వస్తాయని జోస్యం చెబుతున్నారు.

Written By: Dharma, Updated On : May 6, 2023 6:24 pm
Follow us on

Gone Prakash Rao: పచ్చని వైసీపీలో ఒక వ్యక్తి చిచ్చుపెడుతున్నారు.ఆరని మంటలకు కారణమవుతున్నారు. నేతల మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తున్నారు. పోనీ ఆయన పసుపు దళానికి దగ్గరగా ఉన్న వ్యక్తి అనుకుంటే పొరబడినట్టే. దివంగత వైఎస్సార్ కు సన్నిహితుడు. వైసీపీ తొలినాళ్లలో జగన్ వెంట నడిచిన నేత. అయితే ఉన్నపలంగా రాజకీయాల నుంచి విరమించిన ఆయన ఇప్పుడు వైసీపీని టార్గెట్ చేసుకున్నారు. చిచ్చపెట్టడమే కాకుండా.. మంటలకు ఆజ్యం పోస్తున్నారు. ఆయనే తెలంగాణకు చెందిన గోనే ప్రకాశరావు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియా ముందుకొచ్చి వైసీపీ అంతర్గత వ్యవహారాలు మాట్లాడానికి కారణం కూడా గోనె ప్రకాశరావే. దీంతో ఆయన పేరు వింటేనే వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
రాజకీయాలకు దూరమై..
తెలంగాణకు చెంది ప్రకాశరావు చాలా ఏళ్ల కిందటే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇటీవల తెలంగాణ కంటే ఏపీ రాజకీయా గురించే మాట్లాడుతున్నారు. తొలుత యూట్యూబ్ విశ్లేషణతో ప్రారంభించి ..ఇప్పుడు సర్వేలంటూ హడావుడి చేస్తున్నారు. అయితే ఆయన చర్యలన్నీ వైసీపీకి వ్యతిరేకంగా ఉండడం విశేషం. ఇప్పుడు వైసీపీ అంతర్గత వ్యవహారాలు బయటపెట్టి విభేదాలకు ఆజ్యం పోస్తున్నారు. మొన్నటికి మొన్న తిరుమల దర్శనానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. సమకాలిన రాజకీయ అంశాలపై మాట్లాడుతూ త్వరలో బాలినేని టీడీపీలో చేరబోతున్నట్టు ఆరోపించారు. అదే సమయంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో వైవీ వదిలిన ప్రయోగమే ప్రకాశరావు అని భావించి బాలినేని భావోద్వేగానికి గురయ్యారు.
వ్యక్తిగత కామెంట్స్ తో,.
అయితే బాలినేని గురించి అంతటితో ఆగకుండా ప్రకాశరావు చాలారకాలుగా వ్యాఖ్యలు చేశారు. తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. అవినీతి సొమ్ముతో సినిమా నిర్మాణంలో పెట్టుబడులు పెడుతున్నారని కొన్ని సంస్థల పేర్లు కూడా ప్రస్తావించారు. దీంతో ఇవి బాలినేనికి తీవ్ర మనస్తాపానికి గురిచేశారు. దీంతో మీడియా ముందుకొచ్చిన బాలినేని గోనె ప్రకాశరావుపై మండిపడ్డారు. తెలంగాణకు చెందిన ప్రకాశరావుకు ఏపీ రాజకీయాలతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. కావాల్సే ఆయనతో మాట్లడిస్తున్నారని వైవీ సుబ్బారెడ్డిపై అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పార్టీ హైకమాండ్: కు సైతం ఫిర్యాదుచేసినట్టు చెప్పుకొచ్చారు.
వైసీపీ కంట్లో నలుసులా..
అయితే గోనె ప్రకాశరావు తనకు తానుగా మాట్లాడుతున్నారా? లేకుంటే ఎవరైనా ఉన్నారా? అని వైసీపీ హైకమాండ్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. నిజంగా వైవీ సుబ్బారెడ్డి ఉంటే మాత్రం కచ్చితంగా చర్యలకు ఉపక్రమించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. వాస్తవానికి ప్రకాశరావు  జగన్ పరిపాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. టీడీపీ, జనసేన కలిస్తే్ 150 సీట్లు వస్తాయని .. టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా 100 సీట్లు వస్తాయని జోస్యం చెబుతున్నారు. సర్వేలు చెబుతున్నారు. తానే స్వయంగా ప్రజాభిప్రాయ సేకరణ చేశానని కూడా చెబుతున్నారు. ఆయన ఇంతటితో ఆగేలా లేరని .. వైసీపీకి వ్యతిరేకంగా ఇంకా ఎక్కువ ప్రచారం చేయడానికి సిద్దంగాఉన్నారని వైసీపీ నేతలు నమ్ముతున్నారు. అందుకే ఆదిలోనే చెక్ చెప్పాలని భావిస్తున్నారు.