https://oktelugu.com/

హామీ ఇవ్వడం.. మాట మార్చడం.. వారికి అలవాటేగా.!

ప్రజల ఆకాంక్షలను క్యాష్‌ చేసుకోవడం బీజేపీకి ముందు నుంచి ఉన్న అలవాటే. వారి కోరికలను వాడుకొని రాజకీయంగా లబ్ధిపొందడం.. గెలిచిన తర్వాత అలాంటి చాన్స్‌ లేదని చెప్పడం పరిపాటైంది. ఏదో ఒక విషయంలో హామీ ఇవ్వడం తర్వాత మాట మార్చడం చూస్తూనే ఉన్నాం. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలోనూ అలానే చేసింది బీజేపీ. Also Read: అగ్గువకు విశాఖ భూములు.. 19 వేల ఎకరాలు 55 కోట్లేనట..! తాజాగా.. ఆ పరిస్థితి తెలంగాణలోని పసుపు రైతులకు ఏర్పడింది. […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 16, 2021 / 02:22 PM IST
    Follow us on


    ప్రజల ఆకాంక్షలను క్యాష్‌ చేసుకోవడం బీజేపీకి ముందు నుంచి ఉన్న అలవాటే. వారి కోరికలను వాడుకొని రాజకీయంగా లబ్ధిపొందడం.. గెలిచిన తర్వాత అలాంటి చాన్స్‌ లేదని చెప్పడం పరిపాటైంది. ఏదో ఒక విషయంలో హామీ ఇవ్వడం తర్వాత మాట మార్చడం చూస్తూనే ఉన్నాం. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలోనూ అలానే చేసింది బీజేపీ.

    Also Read: అగ్గువకు విశాఖ భూములు.. 19 వేల ఎకరాలు 55 కోట్లేనట..!

    తాజాగా.. ఆ పరిస్థితి తెలంగాణలోని పసుపు రైతులకు ఏర్పడింది. పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇప్పుడు పసుపు రైతులకు ఏం సమాధానం చెప్పుకుంటారో తెలియకుండా ఉంది. ఎన్నికలకు ముందు అర్వింద్‌ బాండ్‌ పేపర్‌‌ రాసిచ్చి మరీ హామీ ఇచ్చారు. దాన్నే ఎన్నికల సమయంలో ఫ్లెక్సీలుగా ఏర్పాటు చేసి మరీ ప్రచారం చేశారు. పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పుకొచ్చారు.

    ఎన్నికల సమయంలో పసుపు రైతులు తీవ్ర ఆందోళన చేశారు. అలాంటి సమయంలో అర్వింద్‌ ఇచ్చిన హామీతో ఆయనను గెలిపించారు. ఆయన కోసం ప్రచారానికి వచ్చిన బీజేపీ దిగ్గజాలు కూడా అదే హామీ ఇచ్చారు. కానీ.. గెలిచిన తర్వాత బోర్డు తేలేకపోయారు. అంతా సైలెంట్‌ అయిపోయారు. ఇటీవల స్పైసెస్ బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేసి.. అదే పసుపు బోర్డు కంటే పెద్దదన్నట్లుగా హడావుడి చేసే ప్రయత్నం చేశారు. కానీ.. ప్రజలు తిప్పికొట్టారు. ఇప్పటికీ నిజామాబాద్ ఎంపీ పసుపు బోర్డు వస్తదనే చెబుతూ ఉంటారు.

    Also Read: ఒక్కొక్కరుగా ‘హ్యాండ్‌’ ఇస్తున్న రేవంత్ వర్గీయులు

    కానీ.. తాజాగా కేంద్రం ఆ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. తెలంగాణకు పసుపు బోర్డు ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. తాను పసుపుబోర్డు తీసుకు రాకపోతే రాజీనామా చేస్తానని నాడు అర్వింద్‌ చెప్పిన మాటలకు ఇప్పుడు ఏం సమాధానం ఇస్తారని మరోవైపు అప్పుడే అధికార పక్షం నిలదీస్తోంది. రైతులు కూడా ఎంపీ ఇచ్చిన హామీని నిలబెట్టాలని రైతులు కూడా కోరుతున్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు హామీలను నెరవేరుస్తామని ఓట్లు వేయించుకుని ఇప్పుడు డొంక తిరుగుడు కబుర్లు చెప్పడం బీజేపీ నేతలకు అలవాటయిపోయిందన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్