భార్యకు అబార్షన్ లు.. బాలికను బలిస్తే.. ట్విస్ట్ ఇదే

శాస్త్ర సాంకేతికత ఎంత పెరిగినా మనిషి బుద్ధి మాత్రం పెరగడం లేదు. సాధించిన టెక్నాలజీతో చంద్రుడిపై కూడా కాలు మోపినా మనిషిలో అంతర్గతంగా చోటుచేసుకున్న మూఢ విశ్వాసాలను మాత్రం దూరం చేసుకోవడం లేదు. మనిషిలో కలిగే రోగాలకు మూఢ నమ్మకాలే కారణమనుకుని మనుషుల ప్రాణాలు తీసేంత దుస్థితికి దిగజారిపోతున్నారు. రాకెట్ యుగంలోనూ రాతి యుగం నాటి పనులు చేయడంపై ఆశ్చర్యం వేస్తోంది. మూఢ నమ్మకాల మాటున మనుషుల ప్రాణాలు తీసేంత కసాయిగా మారిపోతున్నారు. తన భార్య బాగుండాలనే […]

Written By: Srinivas, Updated On : August 11, 2021 11:54 am
Follow us on

శాస్త్ర సాంకేతికత ఎంత పెరిగినా మనిషి బుద్ధి మాత్రం పెరగడం లేదు. సాధించిన టెక్నాలజీతో చంద్రుడిపై కూడా కాలు మోపినా మనిషిలో అంతర్గతంగా చోటుచేసుకున్న మూఢ విశ్వాసాలను మాత్రం దూరం చేసుకోవడం లేదు. మనిషిలో కలిగే రోగాలకు మూఢ నమ్మకాలే కారణమనుకుని మనుషుల ప్రాణాలు తీసేంత దుస్థితికి దిగజారిపోతున్నారు. రాకెట్ యుగంలోనూ రాతి యుగం నాటి పనులు చేయడంపై ఆశ్చర్యం వేస్తోంది. మూఢ నమ్మకాల మాటున మనుషుల ప్రాణాలు తీసేంత కసాయిగా మారిపోతున్నారు. తన భార్య బాగుండాలనే తపనతో బాలిక ప్రాణాలు తీసిన ఓ వ్యక్తి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది.

తాజాగా బిహార్ రాష్ర్టంలో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ముంగేర్ జిల్లాకు చెందిన దిలీప్ కుమార్ తన భార్యకు తరచూ అబార్షన్ లు కావడంతో పలు ఆస్పత్రులను తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఓ తాంత్రికుడిని కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. దీంతో సదరు తాంత్రికుడు ఓ బాలికను బలివ్వాలని చెప్పాడు. దీంతో అతడు అదే ప్రాంతానికి చెందిన బాలికను కిడ్నాప్ చేసి బలిచ్చాడు. ఆమె కళ్లు, రక్తం సేకరించి క్షుద్రపూజలు చేశాడు. తాంత్రికుడి మాటలు గుడ్డిగా నమ్మిన దిలీప్ కుమార్ తన స్నేహితుల సాయంతో బాలికను కిడ్నాప్ చేసి చంపేశాడు.

ఆగస్టు 4న బాలిక వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే తన తండ్రికి భోజనం ఇచ్చేందుకు వెళ్లింది. కానీ ఇంటికి తిరిగి రాలేదు. ఎంత వెతికినా కనిపించలేదు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. మరుసటి రోజు ఉదయం అదే గ్రామంలోని ఓ ప్రాంతంలో బాలిక మృతదేహం లభ్యమైంది. బాలిక దేహంపై గాయాలుండడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించగా దిలీప్ వ్యవహారం బయటకు వచ్చింది.

దీంతో అతడికి సహకరించిన పర్వేజ్ ఆలమ్, తన్వీర్ ఆలమ్, దశరథ్ కుమార్ లను అరెస్టు చేసి విచారిస్తున్నారు. తమ కూతురిని అత్యాచారం చేసి హత్యచేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మానవ మృగాలకు ఉరి శిక్ష వేయాలని కోరుతున్నారు. బాలికను పొట్టన పెట్టుకున్న వారిని కూడా అదే తీరుగా శిక్షలు వేయాలని అంటున్నారు.