Adani NDTV: అతిపెద్ద మీడియాను కొనేసిన మోడీ ఫ్రెండ్ అదానీ.. ఎన్డీటీవీ ఇక బీజేపీదే?

Adani NDTV: మీడియా చేతిలో ఉంటేనే ఏమైనా చేయవచ్చు.  ప్రధాని మోడీని సైతం భయపెట్టవచ్చు. అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉండగా మోడీని ఓ దిగ్గజ జర్నలిస్టు వరుస ప్రశ్నలతో చెమటలు పట్టించాడు. అప్పటి నుంచి వ్యక్తిగత ఇంటర్వ్యూలు.. మీడియా సమావేశాల్లో మోడీ కనపడితే ఒట్టు. ఇప్పటికీ మీడియాను మోడీ ఒంటరిగా ఎదుర్కోకోకపోవడం ఆయన పెద్ద లోపంగా చెప్పొచ్చు. కేసీఆర్ లా మీడియాను ముందుకూర్చుండబెట్టుకొని వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన దాఖలాలు మోడీ ఈ ఎనిమిదేళ్ల ప్రధాని చరిత్రలో […]

Written By: NARESH, Updated On : August 23, 2022 8:03 pm
Follow us on

Adani NDTV: మీడియా చేతిలో ఉంటేనే ఏమైనా చేయవచ్చు.  ప్రధాని మోడీని సైతం భయపెట్టవచ్చు. అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉండగా మోడీని ఓ దిగ్గజ జర్నలిస్టు వరుస ప్రశ్నలతో చెమటలు పట్టించాడు. అప్పటి నుంచి వ్యక్తిగత ఇంటర్వ్యూలు.. మీడియా సమావేశాల్లో మోడీ కనపడితే ఒట్టు. ఇప్పటికీ మీడియాను మోడీ ఒంటరిగా ఎదుర్కోకోకపోవడం ఆయన పెద్ద లోపంగా చెప్పొచ్చు. కేసీఆర్ లా మీడియాను ముందుకూర్చుండబెట్టుకొని వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన దాఖలాలు మోడీ ఈ ఎనిమిదేళ్ల ప్రధాని చరిత్రలో లేవు.

బలమైన మీడియాలన్నింటిపై బీజేపీ ముద్ర వేస్తోంది. ఇప్పటికే బీజేపీ ఎంపీలు, సానుభూతి పరులతో అగ్ర మీడియా సంస్థలను చేజిక్కించుకున్న మోడీ సర్కార్.. ఇప్పుడు తన ఫ్రెండ్ ద్వారా జాతీయ అగ్ర మీడియా సంస్థ ఎన్డీటీవీని చేజిక్కించుకునే ప్లాన్ వేసింది. గౌతం అదానీకి చెందిన ఏఎంజీ మీడియా నెట్ వర్క్స్ తాజాగా ఎన్డీటీవీని కొనుగోలు చేసింది. ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను కొనుగోలు చేసినట్టు అదానీ గ్రూప్ మీడియా తెలిపింది. మరో 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ ను ఇచ్చింది. 4.93 బిలియన్ రూపాయలకు ఎన్డీటీవీలో మెజార్టీ వాటాను (దాదాపు 56 శాతం)ను చేజిక్కించుకునేందుకు అడుగులు వేస్తోంది.

దేశంలో మోడీ అధికారంలోకి వచ్చాక ఆయన జానీ జిగ్రీ దోస్త్ గౌతం అదానీ సంపద ఊహించనంతగా పెరిగిపోతోంది. మోడీ రాకముందే సోదీలో కూడా లేని అదానీ సంపద ఇప్పుడు ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా.. ప్రపంచంలోనే టాప్ 5కి చేరింది. ముఖ్యంగా మోడీ సర్కార్ అందించిన సహాయ సహకారాలు, ప్రాజెక్టుల వల్లే గౌతం అదానీ ఈ స్థాయికి చేరారన్న విమర్శ రాజకీయ వర్గాల్లో ఉంది.

ఇదే గౌతం అదానీ 2014 ఎన్నికల ముందు మోడీ దేశవ్యాప్త ప్రచారానికి ప్రత్యేక విమానాలు సమకూర్చారని పేరుంది. ఇప్పుడు మోడీ ప్రధాని అయ్యాక అదానీ రుణాన్ని ఇలా తీర్చుకుంటున్నారన్న గుసగుసలు ఉన్నాయి. ఏది ఏమైతేనే అదానీ సంపద మాత్రం పెరుగుతోంది. ఆ డబ్బులను అన్ని రంగాలకు మళ్లిస్తున్నారు. బలమైన మీడియా రంగంలోకి కూడా అదానీ ఇప్పుడు వచ్చేశారు.

అదానీ ఇప్పుడు అగ్ర మీడియా అయిన ఎన్డీటీవీని కొనేయడంతో ఇప్పుడు అది కూడా ఇక బీజేపీ ఫేవర్ జాతీయ చానెల్ గా మారడం ఖాయమంటున్నారు. అదానీ-మోడీ దోస్తానా కావడంతో ఎన్డీటీవీలో కూడా ఇక బీజేపీ వ్యతిరేక వార్తలు కనిపించవు.

ప్రస్తుతం దేశంలోనే ప్రముఖ మీడియా సంస్థ ఎన్డీటీవీ. దీని కింద ఎన్డీటీవీ 24/7, ఎన్డీటీవీ ఇండియా, ఎన్డీటీవీ ప్రాఫిట్ అనేూ మూడు జాతీయ వార్త ఛానెల్ లు ఉన్నాయి. వివిధ సోషల్ మీడియాలలో దాదాపు 35 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ తో అత్యధికంగా అనుసరించే వార్తా చానెల్ గా ఇండియాలో ఎన్డీటీవీ ఉంది. ఎన్డీటీవీ 123 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అతి తక్కువ అప్పులతో కొనసాగుతోంది. బలమైన మీడియాలో పారిశ్రామికవేత్తలు, రాజకీయ జోక్యంతో దాని విశ్వసనీయత దెబ్బతింటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మునుపటిలా ఎన్డీటీవీకి ఆదరణ దక్కుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.