Gautam Adani: మన దేశంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ముకేశ్ అంబానీ కదా. కానీ చెప్పింది తప్పు సమాధానం. ఇప్పుడు ఈ పేరు మారిపోయింది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆ ప్లేస్‌ను ఆక్రమించేశారు. గత 14 ఏండ్లుగా ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా వెలుగొందుతున్న అంబానీని వెనక్కు నెట్టి అదానీ మొదటి స్థానంలో నిలబడ్డారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని తెలుస్తోంది.

గతంలో ముఖేశ్ అంబానీ దగ్గరలో కూడా లేని అదానీ.. కొవిడ్ సంక్షోభంలో బాగా కోలుకున్నారు. అయితే ఫోర్బ్స్, బ్లూమ్ బర్గ్ ఇండెక్స్ లో వీరిద్దరి సంపదను వెల్లడించారు. అయితే ఇద్దరికీ స్వల్ప తేడా మాత్రమే ఉంది. కాబట్టి ఏ రోజు కారోజు ఇద్దరి ప్లేసులు తారుమారయ్యే అవకాశం కూడా ఉంది. అదానీ ఇప్పుడు 88.5 బిలియన్ డాలర్ల తో ముందు వరుసలో ఉంటే.. అంబీనీ మాత్ర 87.9 బిలియన్ డాలర్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.

వీరిద్దరి మధ్య చాలా కొద్ది పాటి తేడానే ఉంది. అయితే 2021లో అదానీ బాగా పుంజుకున్నారు. ఇతర వ్యాపారస్తులు కొవిడ్ సమయంలో నష్టపోతే.. అదానీ మాత్రం విపరీతంగా సంపాదించుకున్నారు. ఈ రెండు నివేదికల ప్రకారం ఆయన రోజుకు రూ.1000కోట్లు సంపాదించినట్టు సమాచారం. ఏడాది కాలంలో ఆయన సంపద 261 శాతం పెరిగిందని ఈ నివేదికలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన మార్కెట్ విలువ దాదాపు రూ.10లక్షల కోట్లకు చేరుకుంది.
Also Read: తెలంగాణలో మూడో దశ ముగిసినట్లేనా?
అదానీ గ్రీన్ ఎనర్జీ, గనులు, విమానాశ్రయాలు, పోర్టుల్లో ఆయన ఎక్కువగా పెట్టు బడులు పెట్టారు. ఇవే ఆయనకు ఎనలేని సంపదను తీసుకు వచ్చాయి. ముఖ్యంగా అదానీ గ్రీన్ ఎనర్జీ సంపదను అమాంతం పెంచేసింది. అయితే చాలా పెద్ద కంపెనీలతో ముఖేశ్ ఒప్పందాలు వాయిదా పడటంతో ఆయన సంపద డౌన్ అయిపోయింది.
అయితే భవిష్యత్ లో ఇద్దరి మధ్య పోటీ వాతావరణ ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ముఖేశ్ కూడా గ్రీన్ ఎనర్జీ మీద పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. కాబట్టి ఈ విషయంలో ఇద్దరి నడుమ పోటీ ఉంటుందని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే వ్యాపారం చేయడంలో సిద్ధహస్తుడు అయిన ముఖేశ్.. తన స్థానాన్ని దక్కించుకోవడానికి ఏం చేస్తారో చూడాలి.
Also Read: సమ్మె చేయాలని ఉద్యోగులను చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ రెచ్చగొడుతున్నారా?
[…] […]
[…] […]
[…] […]