Garikapati Narasimha Rao- Chiranjeevi: చిరంజీవి.. ఆ ఆడవాళ్లతో ఫొటోసెషన్ ఆపేయ్.. లేకపోతే నే వెళ్లిపోతా.. హర్ట్ అయిన గరికపాటి

Garikapati Narasimha Rao- Chiranjeevi: గరికపాటి నర్సింహారావు.. మంచి ప్రవచనకర్తగా తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. ఆయన పలుకులు ఎంతో చక్కగా ఉంటాయి. అందరికీ స్ఫూర్తినచ్చేలా ఉంటాయి. ఆయన ఒక జ్ఞానబోధ చేస్తున్నట్టుగా ఉంటాయి. అందులో అర్థం పరమార్థం ఉంటాయి. అయితే గరికపాటి ఎప్పుడూ ఏదైనా సభలోనే తనే ఫోకస్ కావాలని.. తను చెప్పింది వినాలని ఆరాటపడుతుంటారు. అలాగే గౌరవం దక్కాలని కోరుకుంటారు. కానీ ఆయనను మించిన క్రేజ్ కలిగిన వారు వస్తే మాత్రం తట్టుకోలేకరు. మెగాస్టార్ […]

Written By: NARESH, Updated On : October 6, 2022 6:14 pm
Follow us on

Garikapati Narasimha Rao- Chiranjeevi: గరికపాటి నర్సింహారావు.. మంచి ప్రవచనకర్తగా తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. ఆయన పలుకులు ఎంతో చక్కగా ఉంటాయి. అందరికీ స్ఫూర్తినచ్చేలా ఉంటాయి. ఆయన ఒక జ్ఞానబోధ చేస్తున్నట్టుగా ఉంటాయి. అందులో అర్థం పరమార్థం ఉంటాయి. అయితే గరికపాటి ఎప్పుడూ ఏదైనా సభలోనే తనే ఫోకస్ కావాలని.. తను చెప్పింది వినాలని ఆరాటపడుతుంటారు. అలాగే గౌరవం దక్కాలని కోరుకుంటారు. కానీ ఆయనను మించిన క్రేజ్ కలిగిన వారు వస్తే మాత్రం తట్టుకోలేకరు. మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ను చూసి తాజాగా గరికపాటి నొచ్చుకున్నారు. ఆయన వస్తే మహిళలు, యువతులు ఎగబడి ఫొటోలు తీసుకోవడంతో గరికపాటి తట్టుకోలేకపోయారు. చిరంజీవి ఆడవాళ్లతో ఫొటోసెషన్ ఆపకపోతే నేను వెళ్లిపోతానంటూ స్టేజీ మీదనే మైక్ పట్టుకొని నిరసన తెలిపారు. ఆయన లేచి వెళ్లబోయారు కూడా కానీ కొందరు ఆపడంతో ఆగిపోయారు.

Garikapati Narasimha Rao- Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ అంటే అది మామూలుగా ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ స్టార్ ఆయన. పైగా ఇటీవల ‘గాడ్ ఫాదర్’ మూవీతో గ్రాండ్ హిట్ కొట్టి ఊపు మీద ఉన్నాడు. అలాంటి చిరు బయటకొస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారు. ఊరుకోరు కదా. అందుకే ‘అలయ్ బలాయ్’లో చిరంజీవిని చుట్టుముట్టి సెల్ఫీల కోసం మహిళలంతా ఎగబడ్డారు. దీనికి నన్ను పిలిచి ఇలా చిరంజీవి కోసం ఎగబడ్డ మహిళలను చూసి ఈర్ష్య కలిగిందో ఏమో కానీ గరికపాటి చిన్నపిల్లాడిలా ప్రవర్తించాడు. చిరంజీవి ఫొటో సెషన్ ఆపకపోతే వెళ్లిపోతానంటూ బెదిరించాడు.

Also Read: Bitthiri Satti Car: బిత్తిరి సత్తి కొన్న రేంజ్ ‘రోవర్’ కారు ఖరీదు ఎంతో తెలుసా?

Garikapati Narasimha Rao- Chiranjeevi

బీజేపీ నేత, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ ప్రతీ సంవత్సరం దసరా తర్వాత రోజు ‘అలయ్ బలయ్’ నిర్వహిస్తుంటారు. హైదరాబాద్ లో నిర్వహించే ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించి సన్మానించి వారితో కలిసి ధావత్ (విందు) పార్టీ చేసుకుంటారు. ఈసారి ఈ వేడుకకు ప్రముఖ ప్రవచనకర్త గరిపాటి నర్సింహారావుతోపాటు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. తనకంటే క్రేజ్ ఉన్న చిరంజీవి రావడంతో అందరూ గుమిగూడి సెల్పీలు తీసుకునే సరికి గరికపాటి హర్ట్ ఇలా ప్రవర్తించాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read:KCR BRS: బిఆర్ఎస్ తో కెసిఅర్ ముందుగా దెబ్బ కొట్టబోయేది ఆ మూడు రాష్ట్రాల నేనా?

Tags