Ganta Srinivasarao: జనసేన పార్టీ విస్తరణకు పూనుకుంటోంది. ఇందులో భాగంగా పలు ప్రయత్నాలు చేస్తోంది. వివిధ పార్టీల్లోని నేతలను తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు పావులు కదుపుతోంది. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మార్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటింగ్ శాతం పెరగడంతో రాబోయే ఎన్నికల్లో తమ ప్రభావం చూపించాలని చూస్తోంది. దీంతో పార్టీని రాష్ర్టంలో బలోపేతం చేసే పనిలో పడింది. రాష్ర్ట అద్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ మేరకు పలు కోణాల్లో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో కాపుల ఐక్యత కోసం తమ పార్టీ ద్వారానే సాధ్యమని చెబుతున్నారు. వారిని తమ పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నంలో పలు వాగ్దానాలు చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావును పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన రాకతో ఏపీ పరిస్థితి పూర్తిగా మారిపోతుందని భావిస్తున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అధికారాన్ని శాసించాలని చూస్తున్నారు.
గంటా శ్రీనివాసరావు ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. దీంతో గంటా అడుగు ఎటు వైపు అని అనుమానాలు వస్తున్నాయి. కానీ ఆయన జనసేనలో చేరతారనే ప్రచారం జోరందుకుంది. గంటా లాంటి నేతల రాకతో పార్టీ ప్రతిష్ట మరింత ఇనుమడించి అధికారం కోసం అడుగులు పడతాయని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు తెలస్తోంది. ఈ పాటికే గంటా ప్రజారాజ్యంలో కూడా తన సేవలందించినట్లు తెలిసిందే.
అయితే గంటా రాకతో రాజకీయ సమీకరణలు మారతాయని తెలుస్తోంది. సామాజిక కోణంలో చూసినా గంటా తో పార్టీకి ప్రయోజనాలే ఉన్నాయని నమ్ముతున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో తమ ప్రభావం చూపించాలంటే పేరున్న నేతలు కావాలని చూస్తున్నట్లు సమాచారం. అందుకే పలు పార్టీల్లో మంచి స్థానంలో ఉన్న నేతలను జనసేనలోకి ఆహ్వానించేందుక పవన్ కల్యాణ్ తగు ప్రణాళికలు వేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.