రగులుతున్న అసంతృప్తి కుంపటి..!

ఏపీలోని వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోంది. ఈ తరుణంలో పార్టీ కోసం కష్టపడిన వారిలో కొందరు ఏదో పదవి దక్కించుకుని సంతోషంగా ఉన్నా… ఇంకొందరు మాత్రం రగిలిపోతున్నారు. తమ ఆస్తులు, ప్రాణాలు పణంగా పెట్టి పార్టీ కోసం పనిచేస్తే తమకు గుర్తింపు లేదని ఆరోపిస్తున్నారు. దీంతో ఒక్కొక్కరు ప్రభుత్వంపై, పార్టీపై వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఆ ధైర్యం చేయలేక ప్రభుత్వాధినేతకు లేఖలు రాస్తున్నారు. దీంతో రెండేళ్లుగా కామ్ గా ఉన్నవారంతా ఇప్పుడు ఒక్కొక్కరు […]

Written By: NARESH, Updated On : May 20, 2021 2:44 pm
Follow us on

ఏపీలోని వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోంది. ఈ తరుణంలో పార్టీ కోసం కష్టపడిన వారిలో కొందరు ఏదో పదవి దక్కించుకుని సంతోషంగా ఉన్నా… ఇంకొందరు మాత్రం రగిలిపోతున్నారు. తమ ఆస్తులు, ప్రాణాలు పణంగా పెట్టి పార్టీ కోసం పనిచేస్తే తమకు గుర్తింపు లేదని ఆరోపిస్తున్నారు. దీంతో ఒక్కొక్కరు ప్రభుత్వంపై, పార్టీపై వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఆ ధైర్యం చేయలేక ప్రభుత్వాధినేతకు లేఖలు రాస్తున్నారు. దీంతో రెండేళ్లుగా కామ్ గా ఉన్నవారంతా ఇప్పుడు ఒక్కొక్కరు బయట పడుతున్నారు.

వైసీపీకి సపోర్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే శ్యామ్ కలకడ అనే పార్టీ నాయకుడు అనుకోకుండా మరణించాడు. అయితే ఆయన కుటుంబ సభ్యులనుప పార్టీ పట్టించుకోలేదని కొందరు నాయకులు ఒక్కతాటిపైకి వచ్చి విమర్శలు చేశారు. దీంతో అధినేత జగన్ దిగి వచ్చి కార్యాలయం నుంచి పరామర్శిస్తున్నట్లు ఓ ప్రకటనను విడుదల చేయించారు. అయితే శ్యామ్ కుటుంబ సభ్యులకు మాత్రం ఇంతవరకు పరిహారం అందలేదని అంటున్నారు.

ఇక గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. నిత్యం తిట్ల పురాణంతో అందరిలో ప్రత్యేకంగా నిలిచాడు. వ్యక్తిగతంగా ఆయన పార్టీ కోసం ఏ పని చేయకున్నా ఇతరులను తిట్టిపోస్తున్నారన్న క్వాలిఫికేషన్తో అతనిని నెత్తిమీద పెట్టుకున్నారని కొందరు బహిరంగంగానే ఆరోపించారు. మరో వ్యక్తి జననేత పేరుతో జగన్ కు అనుకూలంగా వార్తలు రాస్తున్న కేవి సురేశ్ అనే వ్యక్తి కూడా లేఖ రాయడం కలకలం రేపింది.

ఇలా పార్టీ కోసం తాము ఎంతో కృషి చేసినా తమను పట్టించుకోకుండా ఇతరులను అందలం ఎక్కిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే రెండేళ్ల పాటు ఓపిక పట్టిన కొందరు ఇక లాభం లేదిన ఇలా లేఖల యుద్దం చేస్తున్నారు. పార్టీ గెలుపుకోసం తామెంతో కష్టపడితే ఇంతవరకు తమకు కనీసం నామినేటెడ్ పోస్టు కూడా ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు. మరి ఈ ఇష్యూపై జగన్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి..