Full Train Booking:సుదూర ప్రయాణం తక్కువ ఖర్చుతో.. సౌకర్యవంతంగా చేయాలంటే రైలు ప్రయాణమే మేలు అని చాలామంది భావిస్తూ ఉంటారు. అందుకే రైలు సౌకర్యం ఉన్న ప్రదేశంలో ఎక్కువ శాతం ఇందులోనే ప్రయాణిస్తారు. అయితే రైలు ప్రయాణం చేసేటప్పుడు రైల్వే బోర్డు గురించి కూడా పూర్తిగా తెలుసుకొని ఉండాలి. ఇందులో ప్రయాణం చేయాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. అయితే రైలును కేవలం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లడానికి మాత్రమే కాకుండా.. సొంత అవసరాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే ఒకరోజు మొత్తం రైలు మీకు కావాలనుకుంటే అందుకు సంబంధించి అద్దెను చెల్లించి తీసుకోవచ్చు. మరి ఇది ఎలా సాధ్యం? సొంత అవసరాలకు రైలు కావాలంటే ఏం చేయాలి?
Also Read: ఇక డబ్బున్నోళ్లు ఫారిన్ లో సెటిల్ కావడం చాలా ఈజీ.. ఈ దేశాల మీదే వాళ్లకు ఎందుకింత ఇంట్రెస్ట్
భారతదేశంలోని ప్రతి మారుమూల గ్రామానికి రైలు వెళ్లే సౌకర్యం ఉంటుంది. కానీ సరైన రోడ్డు లేకపోవడంతో ఇక్కడికి ఇతర వాహనాలు వెళ్లే ఆస్కారం ఉండదు. దీంతో చాలామంది రైలు ప్రయాణాన్ని నమ్ముకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఒక్కోసారి రైలును సొంత అవసరానికి కూడా వాడుకోవచ్చు. అంటే ఎవరి ఇంట్లోనైనా వివాహం జరిగితే.. బంధువులు, చుట్టాలు పెద్ద మొత్తంలో ఉంటే వారిని రైలులో తీసుకెళ్లాలని అనుకుంటే ప్రత్యేకంగా బుక్ చేసుకోవచ్చు.
ఇలా రైలు కావాలని అనుకునేవారు నెలరోజుల ముందుగానే.. గూగుల్ లోకి వెళ్లి ftr.irctc అని టైప్ చేయాలి. ఇక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో కావాల్సిన సమాచారం ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత 15 రోజులలోపు కన్ఫామ్ మెసేజ్ వస్తుంది. కన్ఫర్మ్ మెసేజ్ వచ్చిన తర్వాతనే బుక్ అయినట్టు అనుకోవాలి. ఇలా కన్ఫామ్ చేసే సమయంలోనే కోచ్ కావాలా? లేదా ట్రైన్ కావాలా? అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అయితే సెక్యూరిటీ డిపాజిట్ కింద ముందే రూ. 50,000 ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ వీటిని రిఫైనబుల్ చేస్తారు.
Also Read: పోస్టాఫీస్ అదిరిపోయే స్కీం.. దీనిలో పెట్టుబడి పెడితే నెలకు రూ.20,500ల ఆదాయం
ఇక ట్రైన్ కోచ్ లేదా ట్రైన్ మొత్తం బుక్ చేసుకున్న వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో ప్రయాణ వివరాలు ముందే చెప్పాల్సి ఉంటుంది. ఈ దూరాన్ని బట్టి ధరను నిర్ణయిస్తారు. అయితే మిగతా ప్రయాణాల కంటే ఈ జర్నీ తక్కువగానే ఉంటుందని కొందరు అంటున్నారు. కానీ ఆ రూట్లో ట్రైన్ సౌకర్యం అందుబాటులో ఉంటే మాత్రమే బుక్ చేసుకోవాలి. లేకుంటే అదనంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పెద్ద మొత్తంలో మందిని తరలించే విషయంలో మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి కొన్ని ప్రయాణాల్లో భోగిని మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు తిరుపతికి కొంతమంది బంధువులతో కలిసి వెళ్లినప్పుడు ఒక భోగిని ప్రత్యేకంగా బుక్ చేసుకోవచ్చు. ఇలా అందరూ కలిసి ఒకే భోగిలో వెళ్లి తిరిగి రావడం వల్ల ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. అంతేకాకుండా ఇలా ఒకేసారి బుక్ చేసుకోవడం వల్ల కూడా టికెట్ ధర తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల రైలులో ఉన్న ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.