Homeజాతీయ వార్తలుమంథనిలో పాతికేళ్లుగా లీగల్ వార్.. హత్యకు కారణం అదే..

మంథనిలో పాతికేళ్లుగా లీగల్ వార్.. హత్యకు కారణం అదే..


మంథని కేంద్రంగా పాతికేళ్లుగా లీగల్ వార్ నడుస్తోందని.. వామన్ రావు దంపతుల హత్య కేసును సీరియస్ గా తీసు కున్నామని సీపీ సత్యనారాయణ అన్నారు. కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా విడిచిపెట్టేది లేదని తెలిపారు. అయితే ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులపై ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో సీపీ మర్డర్ కేసును చాలెంజ్ గా తీసుకున్నారు. స్థానికంగా ఉన్న పోలీసులతో కాకుండా.. మంథనితో సంబంధంలేని బృందంలో విచారణ చేయిస్తామని తెలిపారు. హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశామన్న సీపీ.. దర్యాప్తులోనూ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుమని తెలిపారు.

Also Read: షర్మిల టార్గెట్ ఫిక్స్.. వైఎస్‌ఆర్‌తో కేసీఆర్ పోలిక

గట్టు వామన్ రావు, నాగమణిల హత్యకేసును తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఉన్నతస్థాయి అధికారులను రంగంలోకి దింపారు. దంపతులపై దాడిచేసి, హత్యచేసిన వారిని గుర్తించి 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. కేసులో మరింత లోతుగా విచారించగా.. బిట్టు సీను పాత్ర బయటకు వచ్చింది. కత్తులు, కారు అందించినట్లు తెలిసింది. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసి నిందితులు ఎవరైనా అరెస్టు చేస్తామని సీపీ తెలిపారు.

Also Read: రెండు గంటల వ్యవధిలోనే స్కెచ్‌..: విచారణలోకి ఉన్నతాధికారులు

ఈ కేసులో పుట్టమధు మేనల్లుడు బిట్టు సీను పాత్ర కూడా కీలకంగా ఉందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. బిట్టు సీను హత్యకు ముందు చిరంజీవి, కుంట శ్రీనుతో హత్యకు ముందు చాలాసార్లు మాట్లాడాడు. వారికి కత్తులు, కారు ఇచ్చాడు. మరోవైపు ప్రధాన నిందితుడు కుంట శ్రీనుకు ఊరిలో వామనరావు కుటుంబంతో ఏళ్లకాలంగా విబేధాలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలోనే హత్యలో నేరుగా పాలు పంచుకున్నాడు. ఇప్పటికే ప్రధాన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

అయితే వామన్ రావు తొలుత పుట్టమధు పేరును ప్రస్తావించినట్లు వీడియో వైరల్ అయ్యింది. ఒరిజినల్ గా వీడియో తీసిన వ్యక్తి సెల్ ఫోన్ ను పోలీసులు సీజ్ చేశారు. ఎలాంటి మార్ఫింగ్ , కట్టింగ్ లేకుండా ఒరిజినల్ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పోలీసులు పంపించారు. అందులో పుట్టమధు పేరు లేదని తెలిపారు. ఉన్న వీడియోలు కూడా పాతవని తెలిపారు. 2018 కననా ముందు ఉన్న వీడియోలను వైరల్ చేస్తున్నారి చెప్పిన సీపీ అలాంటివారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. హత్యకు వినియోగించిన ఆయుధాలను కూడా వెలికి తీసేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. సుందిళ్ల బ్యారేజీ లోతు ఎక్కువగా ఉండడంతో గజఈతగాళ్ల సాయంతో త్వరలోనే ఆయుధాలు, బట్టలు బయటకు తీస్తామని సీపీ సత్యనారాయణ తెలిపారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular