సజ్జలపై పెద్దిరెడ్డి ఆగ్రహంగా ఉన్నారా?

నిప్పు లేనిదే పొగరాదు.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పనిదే బయటకు రాదన్న టాక్ నడుస్తోంది. జగన్ కూడా బయటకు రానంతగా సజ్జల వస్తున్నారని.. ఏపీప్రభుత్వ వ్యవహారాలన్నింటిని ఆయనే లీడ్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామంపై మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం రగిలిపోతున్నారట.. ఇప్పుడీ వ్యవహారం ఏపీప్రభుత్వంలో ఓ సీనియర్ మంత్రికి ఆగ్రహం తెప్పించిందట.. ఏంటా కథాకమామిషూ తెలుసుకుందాం.. ఏపీ సీనియర్ మంత్రి పెద్ది రెడ్డి రాంచంద్రారెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారట.. ప్రభుత్వ […]

Written By: NARESH, Updated On : July 25, 2021 6:40 pm
Follow us on

నిప్పు లేనిదే పొగరాదు.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పనిదే బయటకు రాదన్న టాక్ నడుస్తోంది. జగన్ కూడా బయటకు రానంతగా సజ్జల వస్తున్నారని.. ఏపీప్రభుత్వ వ్యవహారాలన్నింటిని ఆయనే లీడ్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామంపై మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం రగిలిపోతున్నారట.. ఇప్పుడీ వ్యవహారం ఏపీప్రభుత్వంలో ఓ సీనియర్ మంత్రికి ఆగ్రహం తెప్పించిందట.. ఏంటా కథాకమామిషూ తెలుసుకుందాం..

ఏపీ సీనియర్ మంత్రి పెద్ది రెడ్డి రాంచంద్రారెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారట.. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై కోపంగా ఉన్నారట.. ప్రస్తుతం సీఎం జగన్ నియమించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ ఆధిపత్యం చెలాయిస్తున్నారు.ఆయన స్వయంగా మంత్రులతో కొన్ని సమస్యలపై సమీక్షిస్తున్నారట..

సాధారణంగా ప్రభుత్వ నిర్ణయాలను మంత్రులు మీడియా ఎదుట వివరిస్తారు. కానీ ఒక సలహాదారు అయ్యిండి మంత్రి స్థానంలో మీడియాను ఉద్దేశించి సజ్జల ప్రసంగిస్తుండడం చూసి ఏపీ మంత్రుల్లో అసంతృప్తి నెలకొందని భోగట్టా. ఇక పోలీసులు, అధికార వర్గాలు వెల్లడించాల్సిన విషయాలను కూడా సజ్జలనే మీడియా ఎదుట వివరిస్తూ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటిపై సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి సీరియస్ గా ఉన్నారని.. ఈ మేరకు జగన్ కు కూడా దీనిపై ఫిర్యాదు చేసినట్టు అమరావతి వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఒక రాజకీయ నాయకుడు కాని సజ్జల రామకృష్ణారెడ్డి నిజానికి రాష్ట్రంలో సీఎం జగన్ కు నీడలా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం ఉంది. వైసీపీ తరుఫున సజ్జల అన్నీ తానై వ్యవహరిస్తూ ఆధిపత్యం చెలాయిస్తున్నారు.

ఇక జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికల సమయంలో ఆర్థికంగా, నైతికంగా మద్దతుగా నిలిచిన మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించడానికి ప్రయత్నించారు. ప్రారంభంలో నెమ్మదిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు బలంగా మారారు. ఆయన పార్టీతోపాటు ప్రభుత్వ సమస్యలపై కూడా ఆదేశించే స్థాయికి ఎదిగారు.

తాజాగా ఉపాధ్యాయుల నియామక సమస్య తెరపైకి వచ్చినప్పుడు మంత్రి ఆదిమూలపు సురేష్ కు బదులుగా సజ్జల తెరమీదకు వచ్చి తనదైన శైలిలో ప్రభుత్వాన్ని సమర్తించారు. ఇక ఇటీవల గృహ నిర్మాణ ప్రాజెక్టుల నిర్మాణ పురోగతిని సంబంధిత మంత్రితో సమీక్షించారు.

తాజాగా ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సలహాదారుల బాధ్యతలు, వారి పాత్రలు, ప్రభుత్వంలో వ్యవహరించాల్సిన తీరుపై కడిగేసింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి పెద్దరెడ్డి సహజంగానే సలహాదారు సజ్జలను పరిమితం చేయాలని చూస్తున్నట్టు సమాచారం.

ఒకవేళ అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళితే పెద్దిరెడ్డినే సీఎం పదవి కోసం ప్రయత్నిస్తున్నారని ఒక ప్రచారం బలంగా ఉంది. ఏపీలోని మెజార్టీ ఎమ్మెల్యేలను మేనేజ్ చేయడంలో పెద్దిరెడ్డి సిద్ధహస్తుడని అంటున్నారు. ఇదే జరిగితే సజ్జలను పక్కనపెట్టడం ఖాయం. ఇక హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు సజ్జల.. జగన్ కేబినెట్ లో నంబర్2 అనిపించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడట.. సజ్జల తీరుపై లోలోపల అసంతృప్తిగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పెద్దిరెడ్డి చక్రం తిప్పబోతున్నారని టాక్ నడుస్తోంది. మరి ఇదే జరిగితే పెద్దిరెడ్డి ప్లాన్లు వర్కవుట్ అవుతాయా? లేవా అన్నది చూడాలి.