Free Bus Travel: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మహాలక్ష్మి పథకాన్ని అమలులో పెట్టింది. ఈ పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో అంటే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ లలో ఉచితంగా ప్రయాణించే అవకాశం మహిళలకు దక్కింది. ఈ పథకాన్ని ప్రారంభించిన రోజు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఆర్టీసీ చరిత్రలోనే ఇది ఒక రికార్డు అని ఆ సంస్థ అధికారులు చెబుతున్నారు. సరే ఆ సంగతి పక్కన పెడితే మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించే అవకాశం ప్రభుత్వం ఇవ్వడంతో.. చాలామంది అతివలు తమకు ప్రయాణ ఖర్చులు తప్పాయని సంబరపడుతున్నారు. అంతేకాదు ఎగబడి మరి ప్రయాణాలు చేస్తున్నారు. ఉచిత అవకాశం ఇవ్వడం వల్ల మగవాళ్లకు కనీసం బస్సుల్లో కూర్చోవడానికి కూడా సీట్లు లభించడం లేదు. అయితే ఈ ఉచిత ప్రయాణానికి సంబంధించి మిగిలిన డబ్బులతో మహిళలు ఏం చేస్తున్నారని ఓ టీవీ విలేకరి ఓ వృద్ధురాలిని ప్రశ్నించాడు. దీంతో ఆమె అతడికి షాక్ లాంటి నిజం చెప్పింది. అది విన్న అతడికి నిజంగానే షాక్ తగిలింది.
ఆ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వృద్ధ మహిళను ఓ టీవీ ఛానల్ విలేకరి పలు ప్రశ్నలు అడిగాడు. మహాలక్ష్మి పథకం ఎలా ఉందని.. టికెట్ లేదు కదా ఇందులో మిగిలిన డబ్బులను ఏం చేస్తావని అడిగితే.. రెండవ మాటకు తావులేకుండా ఆ వృద్ధురాలు క్వార్టర్ మందు కొంటానని చెప్పేసింది. అంతేకాదు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మందు తాగుతానని స్పష్టం చేసింది. దీంతో ఆ విలేఖరికి ఫ్యుజులు ఎగిరిపోయాయి. సాధారణంగా మహిళలకు మద్యం తాగి అలవాటు చాలా తక్కువగా ఉంటుంది.. కానీ ఆ వృద్ధురాలు చెప్పిన తర్వాత ఆ మాట మార్చుకోవాలేమో అనిపిస్తుంది. వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ.. ఆమె చెబుతుంటే అలానే బోధపడుతోంది.
ఇక ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన తర్వాత బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గతంలో ఆడవాళ్లకు సీట్లు ఇచ్చి గౌరవించడం మన విధి అని ఆర్టీసీ బస్సుల్లో రాసేవారు. అని ఇప్పుడు ఆడవాళ్ళ స్థానంలో మగవాళ్లు అనే రాసే స్థాయికి పరిస్థితి దిగజారింది. ఇక ఆడవాళ్లు బస్సుల్లో ఎక్కువగా ప్రయాణిస్తున్న నేపథ్యంలో తమకు గిరాకీ తగ్గిపోయిందని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక నిన్ను హైదరాబాద్ నగర పరిధిలో ఆటో డ్రైవర్లు సర్కారు తీరుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేపట్టారు. కాగా, ఉచిత ప్రయాణం వల్ల మిగిలిన టికెట్ డబ్బులతో క్వార్టర్ మందు కొంటానని ఆ వృద్ధ మహిళ చెప్పిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది.
ఉచిత బస్సు పథకంతో ఇన్ని లాభాలా? #JustAsking pic.twitter.com/b4Ao9Lc4Qx
— Gowtham Pothagoni (@Gowtham_Goud6) December 14, 2023