Donald Trump Arrested: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు అయ్యారు. గత ఎన్నికల్లో ఆయన రెండోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాల సమయంలో ఆయన వ్యవహార శైలి వివాదాస్పదమైంది. దానిపైనే కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి తాజాగా ఆయన అరెస్టు కావడం సంచలనం సృష్టించింది.
2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఐదేళ్ల అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ రెండోసారి పోటీకి దిగారు. కానీ ఎన్నికల ఫలితాల సమయంలో విపరీతమైన కామెంట్లు చేశారు. ఎన్నికల ఫలితాల్లో జోక్యం, కుట్ర తదితర కేసులు ఆయనపై నమోదయ్యాయి.దీంతో ఆయన లొంగిపోవాల్సి వచ్చింది. ఈ మేరకు జార్జియా రాకెటీరింగ్ జైలు వద్ద పోలీసుల ఎదుట లొంగిపోయారు. అయితే కొద్దిసేపటికి ఆయనకు బి లభించింది.
మొత్తం ట్రంప్ పై నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇలాంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తనంతట తాముగా పోలీసులు ఎదుటి లొంగిపోవాలి. అయితే దానిని అరెస్ట్ కింద ధ్రువీకరిస్తారు. రెండు లక్షల డాలర్ల విలువైన బాండ్ ను సమర్పించి బెయిల్ కు ముందస్తుగా అనుమతి తీసుకున్నారు. అయినా సరే డోనాల్డ్ ట్రంప్ జైల్లో 20 నిమిషాల పాటు గడిపారు. బెయిల్ లభించడంతో బయటికి వచ్చారు.వచ్చే ఎన్నికల్లో మరోసారి అమెరికా అధ్యక్ష పరిధిలో దిగాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన కేసుల్లో చిక్కుకోవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.