Homeఆంధ్రప్రదేశ్‌Killi Krupa Rani: ఆ కేంద్ర మాజీ మంత్రి చూపు టీడీపీ వైపు.. అసలేం జరిగిందంటే..

Killi Krupa Rani: ఆ కేంద్ర మాజీ మంత్రి చూపు టీడీపీ వైపు.. అసలేం జరిగిందంటే..

Killi Krupa Rani: వైసీపీ సీనియర్ నాయకులు పక్కచూపులు చూస్తున్నారా? ఎన్నికలు సమీపిస్తుండడంతో సేఫ్ జోన్ ఎంచుకుంటున్నారా? పార్టీ బలోపేతానికి కృషిచేసినా అధిష్టానం గుర్తించకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. ఇటీవల అధికార పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. నేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంటోంది. ఇటువంటి సమయంలో పార్టీలో ఉండడం కంటే సేఫ్ జోన్ చూసుకోవమే మేలన్న నిర్షయానికి అసంతుష్ట నాయకులు వస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ అధికార పార్టీ నుంచి ఇతర పార్టీలకు వలసలుంటాయని తెలుస్తోంది. ఇటువంటి జాబితాలో కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె వైసీపీని వీడుతారని ప్రచారం జరుగుతోంది, ఆమె తెలుగుదేశం పార్టీలో చేరుతారని టాక్ నడుస్తోంది. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలు కూడా అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఆమెకు వైసీపీలో పొమ్మన లేక పొగ పెడుతున్నట్టు అభిమానులు ఆరోపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అధిష్టానం ఉన్న పదవుల నుంచి తొలగించింది. ఎమ్మెల్సీ, రాజ్యసభ వంటి నామినెట్ పదవుల విషయంలో ఊరించి.. పేరు ప్రకటించి.. చివరి నిమిషంలో వేరొకరికి కట్టబెట్టింది. అటు పార్టీ పదవుల్లో కూడా ప్రాధాన్యత దక్కడం లేదు. ఇన్ని అవమానాల నడుమ పార్టీలో కొనసాగడం కంటే.. వీడడమే మేలని కృపారాణి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

Killi Krupa Rani
Killi Krupa Rani

జెయింట్ కిల్లర్ గా..
2003లో కిల్లి కృపారాణి రాజకీయ అరంగేట్రం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వృత్తిరీత్యా డాక్టరు అయిన ఆమె బలమైన కాళింగ సామాజికవర్గానికి చెందిన వారు. దీంతో 2004 ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి, అప్పటి సిట్టింగ్ ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడిపై పోటీ చేశారు. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. నాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినా కృపారాణి ఓటమిని తట్టుకొని పార్టీ బలోపేతానికి కృషిచేశారు. 2009 ఎన్నికల్లో అదే ఎర్రన్నాయుడుపై పోటీ చేసి గెలుపొందారు.

Also Read: Odisha CM Naveen Patnaik: అంతటి నవీన్ పట్నాయక్ కంటతడి పెట్టారు.. అసలు కారణమేంటి?

జైంట్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్నారు. అప్పటికే జాతీయ స్థాయి నాయకుడిగా పేరున్న ఎర్రన్నను మట్టి కరిపించడంతో అందరి కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో పడ్డారు. మన్మోహన్ సింగ్ కేబినెట్ లో మంత్రి పదవిని దక్కించుకున్నారు. అయితే విభజన పుణ్యమా అని 2014లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతింది. అయినా కాంగ్రెస్ లోనే కొనసాగారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. వెంటనే వైసీపీ అధిష్టానం ఆమె జి్ల్లా పార్టీ అధ్యక్షురాలిగా నియమించింది. తగిన ప్రాధాన్యత కల్పించింది. అయితే ఎన్నికల ముందు చేరడంతో ఆమె పోటీచేసే అవకాశం దక్కలేదు. కానీ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం నామినేట్ కోటా కింద ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులు ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. కానీ మూడేళ్లు గడుస్తున్నా ఆమెకు పదవి దక్కలేదు. చివరి నిమిషం వరకూ ఆమె పేరు వినిపించడం.. తరువాత పదవి రాకపోవడం పరిపాటిగా మారింది. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఆమె టిక్కెట్ కేటాయింపు పై సైతం స్పష్టత లేదు. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షురాలి పదవి నుంచి సైతం తప్పించారు. దీంతో ఆమె కొద్దిరోజులుగా మనస్తాపంతో ఉన్నారు. పార్టీ అధిష్టానం తీరుపై కీనుక వహిస్తున్నారు.

Killi Krupa Rani
Killi Krupa Rani

మంత్రితో విభేదాలు..
జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన ప్రసాదరావుతో ఆమెకు రాజకీయ విభేదాలు ఉన్నాయి. పునర్ వ్యవస్థీకరణలో ప్రసాదరావు మంత్రి అయిన తరువాత కృపారాణికి కష్టాలు ప్రారంభమయ్యాయని ఆమె అనుచరులు చెబుతున్నారు. అధిష్టానం రాజ్యసభకు ఎంపిక చేసినా ధర్మాన ప్రసాదరావే అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. కనీసం జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టకుండా అడ్డుకుంటున్నారని.. ఇదెక్కడి న్యాయమని అధిష్టాన పెద్దలకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదు. దీనికితోడు ఇటీవల సీఎం జగన్ జిల్లా టూరులో ఆమెకు అవమానం జరిగింది. జగన్ కు ఆహ్వానం పలికేందుకు వెళుతున్న ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. తాను కేంద్ర మాజీ మంత్రినని.. వైసీపీ సీనియర్ నాయకురాలినని చెప్పినా వారు వినలేదు. లోపలికి అనుమతించలేదు. దీంతో కన్నీటిపర్యంతమైన ఆమె కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. దీని వెనుక ధర్మాన ప్రసాదరావు ఉన్నారంటే ఆమె వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై అధిష్టానానికి ఫిర్యాదుచేసినా పట్టించుకోకపోవడంతో పార్టీ మారడమే ఉత్తమమని భావిస్తున్నారు. టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. టీడీపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఆమె చేరికను ఖరారు చేస్తారని అనుచరులు చెబుతున్నారు.

Also Read:KCR vs BJP: కేంద్రంపై మరోపోరాటం.. రెడీ అయిన కేసీఆర్..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular