Nayantara- Vegnesh: సినిమా వాళ్లకు.. ముఖ్యంగా హీరోయిన్లకు ఏదైనా వ్యాపారమే. అది ఎమోషన్ అయినా, లేక కార్యమైనా.. అంతా బిజినెసే. జీవితంలో పెళ్లి అనేది అతి ముఖ్యమైన కార్యం. అలాంటి ముఖ్యమైన కార్యాన్ని ఎవరు వ్యాపారంగా భావించరు. కానీ, హీరోయిన్లకు అది కూడా బిజినెసే. ఆఖరికి పెళ్లిని కూడా వ్యాపారంగా మార్చుకుని డబ్బులు వసూలు చేస్తేనే.. వినేవాళ్ళకు కాస్త అది ఇబ్బందిగా ఉంటుంది. అయినా డబ్బు కోసం అలాంటి ఎన్నో రకాల ఇబ్బందులను దాటుకుని వచ్చాం, ఇక మాకేం ఇబ్బంది అంటారు సదురు హీరోయిన్లు.

ఇక ఈ బిజినెస్ లో కూడా రకరకాల డిమాండ్స్ ఉన్నాయి. హీరోయిన్ ఎవరో ముక్కు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకుంటే.. ఆ పెళ్లికి పెద్దగా డిమాండ్ ఉండదు. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు ఉంటుంది వ్యవహారం. అదే సెలబ్రెటీలు ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్, స్టార్ హీరోయిన్ ప్రేమ పెళ్లి చేసుకుంటే.. ఇక ఆ పెళ్ళికి ఎక్కడ లేని క్రేజ్ ఉంటుంది.
విపరీతమైన మైలేజీ వస్తోంది. చాలా ఏళ్ళు సహజీవనం తర్వాత నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది. గత నెలలో వీరి వివాహం మహాబలిపురంలో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే వీరి వివాహ వేడుక మొత్తాన్ని వీడియోలుగా చిత్రీకరించి నెట్ ఫ్లిక్స్ కి అమ్ముకున్నారు. పైగా ఈ ఎపిసోడ్స్ ని గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారని తెలుస్తోంది.
కానీ, నయనతార జంట మ్యారేజ్ వీడియో టెలికాస్ట్ చేసే విషయంలో నెట్ ఫ్లిక్స్ సంస్థ షాక్ ఇచ్చింది. అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేసుకుందని తెలుస్తోంది. దీనికి ముఖ్య కారణం విగ్నేష్ శివన్ అని టాక్ నడుస్తోంది. నయనతార పెళ్లికి రజనీకాంత్, షారుఖ్ ఖాన్, మణి రత్నం, కార్తి వంటి బడా సెలబ్రిటీలు వచ్చారు. కాగా వారి ఫోటోలను ఈ మధ్యనే విగ్నేష్ శివన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఇది సరైన పద్ధతి కాదు అంటుంది నేటి ఫ్లిక్స్ సంస్థ. వివాహ స్ట్రీమింగ్ హక్కులు తమ దగ్గర ఉన్నప్పుడు.. మీరు ఎలా ఫోటోలు షేర్ చేస్తారని ప్రశ్నిస్తూ.. ఒప్పందం రద్దు చేసుకోవడానికి నెట్ ఫ్లిక్స్ సంస్థ సిద్ధమైంది. పైగా నయనతార జంట వివాహ వేడుకకు 10 కోట్ల భారీ మొత్తంలో నెట్ ఫ్లిక్స్ సంస్థ ఖర్చు పెట్టింది. అలాగే మరో పాతిక కోట్లు ఇస్తామని అగ్రిమెంట్ చేసుకుంది. ఇప్పుడు ఆ అగ్రిమెంట్ ను క్యాన్సిల్ చేసుకుని., వివాహ ఖర్చులకు పెట్టిన 10 కోట్లు తిరిగి ఇవ్వమని నయనతార, విగ్నేష్ శివన్ ను నెట్ ఫ్లిక్స్ వారు అడుగుతున్నారు.