https://oktelugu.com/

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జికీ కరోనా..

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తానే ట్వీటర్లో సోమవారం వెల్లడించారు. రెగ్యూలర్ చెకప్ భాగంగా ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు అనుమానంతో కరోనా టెస్టులు చేయడంతో ఈ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. తనను ఇటీవల కలిసి వారంతా కరోనా పరీక్షలు చేయించుకుని హోం ఐసోలేషన్ కు వెళ్లాలని ఆయన సూచించారు. Also Read: ట్రైన్ ప్రయాణానికి 9 […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 10, 2020 / 04:36 PM IST
    Follow us on


    మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తానే ట్వీటర్లో సోమవారం వెల్లడించారు. రెగ్యూలర్ చెకప్ భాగంగా ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు అనుమానంతో కరోనా టెస్టులు చేయడంతో ఈ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. తనను ఇటీవల కలిసి వారంతా కరోనా పరీక్షలు చేయించుకుని హోం ఐసోలేషన్ కు వెళ్లాలని ఆయన సూచించారు.

    Also Read: ట్రైన్ ప్రయాణానికి 9 రూల్స్!

    మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆయనకు ఎవరి వల్ల కరోనా సోకిందనే చర్చ నడుస్తోంది. ఆయనను ఎక్కువగా రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాల్లోని సెలబ్రెటీలు ఇటీవల తరుచూ కలుస్తున్నారు. ఈక్రమంలోనే వారి నుంచి ఆయనకు కరోనా సోకి ఉండొచ్చనే టాక్ విన్పిస్తోంది. కాగా ప్రణబ్ వయస్సు 60ఏళ్లు పైబడి ఉండటంతో ఆయన ఆరోగ్యంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    ఇటీవల దేశంలోని సినీ సెలబ్రెటీలు, రాజకీయ నాయకులంతా కరోనా బారినపడి వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కుటుంబం కూడా కరోనా బారిన పడింది. అమితాబ్ 60ఏళ్లు పైబడినప్పటికీ కరోనాను జయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇక అమితాబ్ కోడలు ఐశ్వర్యరాయ్ బచ్చన్, మనవరాలు ఆరాధ్య కూడా కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ సైతం కరోనా నుంచి కోలుకున్నారు.

    Also Read: 2000 నోట్లు రద్దు?

    అదేవిధంగా రాజకీయ ప్రముఖుల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇటీవల కరోనా బారినపడ్డారు. వీరితోపాటు పలువురు మంత్రలకు కరోనా బారినపడి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మధ్యప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులకు సైతం కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక పలు రాష్ట్రాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల‌కు క‌రోనా సోకింది. వీరిలో కొంతమంది మృత్యువాతపడగా మరికొందరు రికవరీ అవుతున్నారు.