Buddha Venkanna Arressted: ఆంధ్రప్రదేశ్ లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలుగుదేశం, వైసీపీ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇవి తీవ్ర స్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను అర్థరాత్రి పోలీసులు అరెస్టు చేసి విడుదల చేయడం సంచలనం సృష్టిస్తోంది. టీడీపీ నేతలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వైసీసీ నేతలపై ఆరోపణలు చేసిన వారిని విడిచిపెట్టకుండా తమ ప్రభావం చూపిస్తున్నారు. దీంతో టీడీపీ నేతల్లో భయం పట్టుకుంటోంది.

వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే వారిని ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్టు చేయించడం మామూలే. వెంకన్న మంత్రి కొడాలి నాని, డీజీపీపై చేసిన వ్యాఖ్యలతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో రాజకీయ దుమారం రేగుతోంది. అధికార పార్టీ తాను అనుకున్నది సాధిస్తోంది. ప్రతిపక్ష నేతలను తమ గుప్పిట్లో పెట్టుకుంటోంది.
Also Read: ఏపీ సర్కార్ కు షాకిచ్చిన ఉద్యోగ సంఘాలు
దీంతో రాష్ర్టంలో రాజకీయ వైషమ్యాలు పెరుగుతున్నాయి. ఇటీవల చిత్తూరు జిల్లాలో మైనింగ్ మాఫియా రాజ్యమేలుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో నేతల మధ్య దూరం పెరుగుతోంది. కుప్పంలో ప్రతిపక్ష నేత చంద్రబాబును ఓడించి సవాలు విసురుతున్న వైసీపీని కూడా కట్టడి చేయాలని టీడీపీ భావిస్తోంది.
రెండు పార్టీల్లో విభేదాలు ముదురుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నెలకొన్న గొడవలు ముదురుతున్నాయి. దీంతో రెండు పార్టీల నేతలు టార్గెట్ చేసుకుంటూ వారిని దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. దీనికి అధికార పార్టీ పోలీసుల సాయం తీసుకుంటోంది. ప్రతిపక్షం మాత్రం మాటలతోనే వారిని నిలదీస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ఈ విభేదాలు ఎక్కడికి దారి తీస్తాయో తెలియడం లేదు.
Also Read: టీడీపీ బాటలో బీజేపీ.. కొడాలి నాని ఇలాకాపై దండయాత్ర.. సోము వీర్రాజు, నేతలు అరెస్ట్