Himanta Biswa Sarma 1950 law: అసోం.. భారత ఈశాన్య రాష్ట్రాల్లో కీలకమైనది. బంగ్లాదేశ్ సరిహద్దుగా ఉన్న ఈ రాష్ట్రంలో బంగ్లాదేశ్ చొరబాటుదారులే ఎక్కువ. అనేక ప్రాతాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు. ఆశ్రమాలు వారి ఆధీనంలోఉన్నాయి. ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. గత ప్రభుత్వాలు వీరిని పంపించే చర్యలు చేపట్టలేదు. దీంతో దశాబ్దాలుగా పాతుకుపోయారు. ఇప్పడు హిమంత బిశ్వశర్మ ప్రభుత్వం బంగ్లాదేశీయులను పంపించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే సీఎం హిమంత బిశ్వశర్మ 1950లో రూపొందించిన ఇమ్మిగ్రెంట్స్ (ఎక్స్పల్షన్ ఫ్రం అసోం) చట్టాన్ని తిరిగి బయటకు తీశారు. ఈ చట్టం పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి తరలివచ్చిన, అనధికారిక నివాసితులను ఎరివేయడానికై రూపొందించబడింది. గతంలో అది అమలు కాకపోవటంతో అనేక సమస్యలు ఎదురైనప్పటికీ, ఈసారి ఈ చట్టాన్ని ప్రభుత్వ కమిటీ సాయంతో రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించారు.
పది రోజుల్లో పంపించే పవర్..
1950 చట్టానికి విశేష అధికారాలు ఉన్నాయి. దీనిని నెహ్రూ ప్రభుత్వం రూపొందించింది. దీనిప్రకారం.. జిల్లావారీ మేనేజర్లు (డిస్ట్రిక్ట్ కమిషనర్లు) అనుమానిత విదేశీ వాసులను గుర్తించి, తమ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు 10 రోజులు సమయం ఇస్తారు. వారు తగిన ఆధారాలు ఇవ్వకపోతే, వారిని వెంటనే ఎరివేయడానికి ఆదేశాలు జారీ చేయబడతాయి. ఇది ఫారెనర్స్ ట్రైబ్యునల్స్ పాత్రను తగ్గించి, పరిపాలన అధికారాన్ని పెంచే చర్యగా ఉంటుంది.
అమలు చేయకుండా..
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలించిన కాలంలో 1950 చట్టం అమలు చేయలేదు. నెహ్రూ పాలన కారణంగా తర్వాతి కాలంలో వచ్చిన పాలకులు కూడా దీనిని పట్టిచుకోలేదు. గత ప్రభుత్వాలు వీరిని పోషించాయి. వీరిని ఏరివేసేందుకు హిమంత బిశ్వశర్మ 1950లో చేసిన చట్టాన్ని బయటకు తీశారు. 1950 నాటికే తూర్పు పాకిస్తాన్ నుంచి వచ్చేవారు ఎక్కువ. అందుకే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని తీసుకొచ్చింది. దీనిని గోపినాథ్ బోర్డోలైన్ అసోం మొదటి సీఎం ప్రతిపాదించారు. ఈయన ఇంకో పని కూడా చేశారు. 1951లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ చేయించారు. అసోంలో ఉన్నవారి జాబితా రూపొందించారు. దాని ఆధారంగా పదేళ్లకోసారి దీనిని సవరిస్తున్నారు. బయటి దేశాలవారిని పంపించాలి. కానీ, కాంగ్రెస్ తర్వాత దీనిని పక్కన పడేశారు.
నెహ్రూ అటకెక్కించారు..
అయితే 1950 చట్టాని నెహ్రూ గోపీనాథ్ బోడొలోయే అమలు చేయకుండా ఒత్తిడి తెచ్చారు. ఎన్ఆర్సీ అమలు చేయడానికి అనుమతిచారు. తర్వాత దానిని కూడా పక్క పెట్టారు. చైనీయులు కూడా అసోంలో ఉండేవారు. థాయ్‌లాండ్ నుంచి, బర్మా నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చేవారిని తరిమేసే బాధ్యత నాగాలాండ్, మేఘాలయా, మిజోరాం లో కూడా 1950 చట్టం అమలు చేసింది. కానీ, దానిని పాలకులు పక్కన పడేశారు.
బయటకు తీసిన హిమంత..
ఈ చట్టం గురించి ఇప్పటి తరానికి తెలియదు. కానీ దీనిని అసోం ప్రస్తుత సీఎం హిమంత బిశ్వశర్మ బయటకు తీశారు. బంగ్లాదేశీయులను ఏరివేయడానికి ఇబ్బంది వస్తుండడంతో ఈ చట్టం బయటకు తీశారు. విదేశీయులను గుర్తించినా పంపించలేకపోతున్నారు. కోర్టును ఆశ్రయిస్తున్నారు. దీంతో 1950 యాక్ట్‌తో కోర్టులు కూడా విదేశీయులకు వ్యతిరేక తీర్పు ఇచ్చేలా చట్టాన్ని అమలు చేస్తున్నారు. చొరబాటుదారుల ఏరివేతకు ఈ చట్టం ఇప్పుడు ఆయుధంగా మారింది.