AP BJP: ఏపీ విషయంలో బిజెపి అగ్ర నేతలు సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ కు సంబంధించిన పరిణామాల వెనుక కేంద్ర పెద్దల హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం ఇది అనుమానంతో ఉండేవి. అటు ఏపీ సీఎం జగన్ సైతం ఇదే రకమైన అనుమానాలను వ్యక్తం చేస్తూ సంకేతాలు పంపారు. ఇటువంటి తరుణంలో ఏపీలో భారతీయ జనతా పార్టీకి డ్యామేజ్ అయ్యే పరిస్థితులు తలెత్తాయి. ఏపీ అంతర్గత రాజకీయాల్లో తమను బాధ్యులను చేయడాన్ని అగ్ర నేతలు గ్రహించారు. అందుకే లోకేష్ తో సమావేశమై పరిస్థితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు.
లోకేష్ ప్రెస్ మీట్ తో దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చింది. చంద్రబాబు అరెస్టు తరువాత లోకేష్ దాదాపు మూడు వారాలకు పైగా ఢిల్లీలోనే గడిపారు. ఆయన అపాయింట్మెంట్ కోరినా కేంద్ర పెద్దలు స్పందించలేదని వార్తలు వచ్చాయి. కానీ లోకేష్ మాత్రం ఏపీలో పరిస్థితిని తెలుసుకునేందుకు తనను కలవాలని అమిత్ షా కోరినట్లు లోకేష్ చెబుతున్నారు. దీంతో ఏపీ పరిస్థితులపై కేంద్ర పెద్దలకు ఒక అవగాహన ఉన్నట్లు తెలుస్తోంది. తమను అడ్డం పెట్టుకొని ఏపీలో సాగుతున్న పొలిటికల్ గేమ్ ను వారు గ్రహించినట్లు సమాచారం. అందుకే లోకేష్ ను పిలిపించి మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది.
అటు పురందేశ్వరి సైతం అమిత్ షా తో లోకేష్ భేటీ జరిగిన తర్వాత ఒక ట్విట్ చేశారు. చంద్రబాబు అరెస్టు వెనక కేంద్ర పెద్దల హస్తము ఉందని చెబుతున్న వారు.. ఇప్పుడేమంటారు అంటూ ట్విట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అంతకుముందే సీఎం జగన్ చంద్రబాబు అవినీతి ప్రధాని మోదీకి ఎరుక అని, కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేసిన తర్వాతే ఏపీ సిఐడి ఎంటర్ అయిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు అరెస్టు పాపాన్ని కేంద్ర పెద్దలపై నెట్టే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని గ్రహించే బిజెపి అగ్ర నేతలు తమకు తాముగా లోకేష్ ను తమ వద్దకు పిలిపించుకున్నట్లు తెలుస్తోంది.
ఏపీ విషయంలో ఇప్పుడు బిజెపి ఆగ్రనేతలు ఏం చేస్తారన్నది ప్రశ్నార్ధకంగా మిగిలింది. జగన్ సర్కార్ను కట్టడి చేస్తారా? లేకుంటే చంద్రబాబు న్యాయ పోరాటానికి సహకరిస్తారా? అన్నది చూడాలి. తమ భేటీలో చంద్రబాబు కేసును ఏ బెంచ్ విచారణ చేపడుతుందో అమిత్ షా తెలుసుకున్నారని లోకేష్ చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బిజెపి నేతల తరువాత స్టెప్ ఏమిటనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ భేటీలో రాజకీయ చర్చ జరగలేదని లోకేష్ చెబుతున్నారు. ఇప్పటికే టిడిపితో జనసేన పొత్తు ప్రకటించింది. బిజెపితో జనసేన మిత్రపక్షంగా ఉంది. అటు పవన్ సైతం ఢిల్లీ వచ్చి బిజెపి అగ్రనేతలను కలుస్తానని చెప్పుకొచ్చారు. అంతకంటే ముందే వచ్చి పురందేశ్వరి అమిత్ షా తో చర్చలు జరిపారు. అనంతరం లోకేష్ ను తీసుకెళ్లి అమిత్ షా ఎదుట కూర్చోబెట్టారు. చంద్రబాబు అరెస్టు విషయంతో పాటు రాజకీయ చర్చలు సైతం జరిపి ఉంటారని ప్రచారం జరుగుతోంది. కానీ లోకేష్ మాత్రం చంద్రబాబు కేసుల విషయంలో న్యాయం వైపు ఉండాలని మాత్రమే అమిత్ షాను కోరినట్లు చెబుతున్నారు. చూడాలి తర్వాత పరిస్థితులు ఎలా ముందుకెళ్తాయో?