Floods: ఏపీలోని రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలకు ఇటీవల వచ్చిన వరద జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. రాయలసీమ జిల్లాలు, నెల్లూరు వరదలతో అపారంగా నష్టపోయాయి. రైతులు వేసిన పంటలు నీటిలో మునిగిపోవడంతో ఆర్థికంగా చాలా నష్టోపోవాల్సి వచ్చింది. ఇళ్లలోని సామాగ్రి, పశువులు వరదల్లో కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగి భీకర వాతావరణాన్ని సృష్టించాయి. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియలో చక్కర్లు కొడుతూ పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించాయి.
వరదల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించి నష్టంపై ఓ అంచనాకు వచ్చారు. వరద సాయాన్ని అందించాలని కేంద్రాన్ని కోరారు. అంతకముందే ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోన్లో మాట్లాడి ఏపీని అన్నివిధలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే వరద పరిస్థితులను అంచనా వేయడానికి కేంద్రం బృందం రాష్ట్రానికి వచ్చింది. మూడురోజులు క్షేత్ర పర్యటనలు నిర్వహించిన అనంతరం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆ బృందం కలిసింది.
అయితే ఏపీ సర్కారు వరద సాయంపై కేంద్ర బృందానికి ఎలాంటి నివేదిక ఇచ్చారో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ వీరి వెళ్లిన తర్వాత మాత్రం ఏపీ సీఎంవో ఓ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసింది. ఇందులో సీఎం జగన్మోహన్ రెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించింది. వరదల సమయంలో సీఎం జగన్ పనితీరు భేష్ అన్నట్లుగా ప్రెస్ నోట్ మొత్తం ఆయన్ని పోగడడానికి కేటాయించింది. ఇలాంటి విపత్తుల సమయంలో కరెంట్ పునరుద్ధరణ అసాధ్యమని కానీ వెంటనే ప్రభుత్వం చేసేందంటూ కితాబిచ్చారు.
Also Read: ఏపీ మునుగుతోంది.. మళ్లీ భయానక వాతావరణం
కలెక్టర్లకు కావాల్సిన నిధులన్నీ ఇచ్చారని వీటిలో వారంతా పనులు వేగంగా చేశారంటూ ప్రశంసలు కురిపించింది. మరోవైపు రాష్ట్రం దగ్గర విపత్తు నిధులు నిండుకున్నాయని చెప్పుకొచ్చింది. కోవిడ్ నియంత్ర కోసం ఎన్డీఆర్ఎఫ్ నిధులు వినియోగించినట్లు పేర్కొంది. వరదల వల్ల రూ. ఆరు వేలకోట్ల నష్టం వాటిల్లిందని కేంద్రం వెంటనే నిధులు ఇప్పించాలని కోరారు.
మొత్తంగా ఏపీ సీఎంఓ జగన్ పై ప్రశంసలు కురిపిస్తూ విడుదల చేసిన ప్రెస్ నోట్లో వరద సాయం ప్రజలకు ఏమేరకు అందిస్తామనే దానిపై క్లారిటీ మరిచారు. దీంతో ఏపీ సర్కారు ప్రజలకు సాయం అందిస్తుందా? లేదంటే ప్రకటనలతోనే చేతులు దులుపుకుంటుందా? అనే కామెంట్స్ విన్పిస్తున్నాయి.
Also Read: ఏపీకి పొంచి ఉన్న మరో భారీ ముప్పు