https://oktelugu.com/

వరద సాయం: చేతులు కాలాక టీఆర్ఎస్ సర్కార్ ఆకులు పట్టుకుందా?

హైదరాబాద్‌ మహానగరంలో వరదల వచ్చి వెళ్లి పదిహేను రోజులకు పైగానే అవుతోంది. కానీ.. బాధితులకు సాయం అందించడంలో మాత్రం ఇంకా నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. ఇంత పెద్ద నగరంలో అంత మంది నాయకులు ఉన్నా ఇంకా పూర్తిస్థాయిలో సాయం అందలేదు. అందులోనూ అవకతవకలే నడుస్తున్నాయి. వరద సాయంలో చేయడంలోనూ వక్ర బుద్ధి చూపడంపై బాధితులు, పార్టీలు ధర్నాలు చేశాయి. నిరసనలు తెలిపారు. ర్యాలీలు నిర్వహించారు. దీంతో ఆ పంపిణీ ప్రక్రియకు ప్రభుత్వం బ్రేక్‌ వేసింది. మరిన్ని తెలంగాణ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2020 / 10:43 AM IST
    Follow us on

    హైదరాబాద్‌ మహానగరంలో వరదల వచ్చి వెళ్లి పదిహేను రోజులకు పైగానే అవుతోంది. కానీ.. బాధితులకు సాయం అందించడంలో మాత్రం ఇంకా నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. ఇంత పెద్ద నగరంలో అంత మంది నాయకులు ఉన్నా ఇంకా పూర్తిస్థాయిలో సాయం అందలేదు. అందులోనూ అవకతవకలే నడుస్తున్నాయి. వరద సాయంలో చేయడంలోనూ వక్ర బుద్ధి చూపడంపై బాధితులు, పార్టీలు ధర్నాలు చేశాయి. నిరసనలు తెలిపారు. ర్యాలీలు నిర్వహించారు. దీంతో ఆ పంపిణీ ప్రక్రియకు ప్రభుత్వం బ్రేక్‌ వేసింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    మళ్లీ సాయం పంపిణీని నిన్నటి నుంచి ప్రారంభించింది. కొన్ని చోట్ల మాత్రమే పంపిణీ జరగగా, చాలా చోట్ల దాని గురించి ప్రస్తావన లేదు. నగదు పంపిణీ పునఃప్రారంభమైనా కొన్ని చోట్ల సాంకేతిక లోపాలు, నెట్‌వర్కింగ్‌ సమస్యలు, యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ ఎంట్రీలో ఇబ్బందులతో బృందాలకు తిప్పలు తప్పలేదు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో వరద సాయం పంపిణీ చేయడానికి 14 మంది అధికారులకు లాగిన్‌ ఇవ్వగా, ఏడుగురికి మాత్రమే ఓపెన్‌ అయ్యింది. దీంతో కొన్ని చోట్ల మాత్రమే పంపిణీ చేశారు.

    Also Read: వరదసాయం పంపిణీలో భారీ కుంభకోణం: రేవంత్‌రెడ్డి

    హైదర్‌గూడలో స్థానిక నాయకుడొకరు గొడవ చేయడంతో అధికారులు వరద సాయం పంపిణీ నిలిపేశారు. మిగతా ఆరు చోట్లలో రెండు చోట్ల లాగిన్‌ మధ్యలో ఆగిపోయింది. మిగిలిన నాలుగు బృందాలు తమ పరిధిలోని బాధితులకు వరద సాయం అందించాయి. సర్కిల్‌లో 214 మందికి పంపిణీ చేశారు. పరిహారం సమాచారంతో ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌ సర్కిళ్లలో బాధితులు ఎదురుచూసినప్పటికీ లాగిన్స్‌ రాకపోవడంతో వారికి నిరాశే మిగిలింది. హయత్‌నగర్‌, బీఎన్‌రెడ్డి నగర్‌లో కొందరికి మాత్రమే నగదు అందజేశారు.

    Also Read: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పసుపు పార్టీ కనిపిస్తుందా..?

    ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలో ఇంతకుముందు నగదు పంపిణీ చేసిన ఉద్యోగులను పక్కన బెట్టి కొత్తవారికి బాధ్యత అప్పగించారు. ఒక్కో బృందానికి కేవలం 30 నుంచి 40 మందిని మాత్రమే కేటాయించి వారికి సరిపడా డబ్బులు ఇచ్చి పంపించారు. గతంలో డబ్బులు అందని ప్రాంతాలలో మాత్రమే పంపిణీ జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రామంతాపూర్‌ డివిజన్‌ పరిధిలో గురువారం ప్రారంభమైన ప్రక్రియలో గందరగోళం ఏర్పడింది. కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌లోని నాలుగు డివిజన్లలో ఒక్కో డివిజన్‌లో 25 కుటుంబాల చొప్పున వంద కుటుంబాలకు నగదు పంపిణీ చేశారు. గాజుల రామారం సర్కిల్‌లో నాలుగు డివిజన్లకు గాను సాంకేతిక లోపాల వల్ల సూరారం, చింతల్‌ డివిజన్‌లో 55 కుటుంబాలకు పంపిణీ చేశారు. గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుతం డివిజన్‌కు కేవలం రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఈసారైనా పంపిణీని పారదర్శకంగా నిర్వహించి బాధితులకు అండగా నిలుస్తారో చూడాలి మరి.