https://oktelugu.com/

ఆ తప్పులే ట్రంప్‌ ఓటమికి కారణమా?

ప్రజల్లో గుండెల్లో గూడు కట్టుకున్న ఏ నేతకైనా ఓటమి ఉండదు. అది ఏ స్థాయి లీడర్‌‌ అయినా సరే.. ఒక్కసారి ప్రజల్లో నమ్మకం ఏర్పడిందంటే చివరివరకూ ఆయనకే అండగా నిలుస్తుంటారు. ఆయననే గెలిపిస్తుంటారు. అలా.. మన దేశ ప్రధాని మోడీ రాజకీయ గ్రాఫ్‌ తీసుకున్నా ఎక్కడో గుజరాత్‌ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన ఇప్పుడు దేశానికి ప్రధాని అయ్యారు. ఏనాడూ రాజకీయంలో వెనక్కి తిరిగి చూడలేదు. మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు కానీ.. ఇప్పుడు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2020 / 10:48 AM IST
    Follow us on

    ప్రజల్లో గుండెల్లో గూడు కట్టుకున్న ఏ నేతకైనా ఓటమి ఉండదు. అది ఏ స్థాయి లీడర్‌‌ అయినా సరే.. ఒక్కసారి ప్రజల్లో నమ్మకం ఏర్పడిందంటే చివరివరకూ ఆయనకే అండగా నిలుస్తుంటారు. ఆయననే గెలిపిస్తుంటారు. అలా.. మన దేశ ప్రధాని మోడీ రాజకీయ గ్రాఫ్‌ తీసుకున్నా ఎక్కడో గుజరాత్‌ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన ఇప్పుడు దేశానికి ప్రధాని అయ్యారు. ఏనాడూ రాజకీయంలో వెనక్కి తిరిగి చూడలేదు.

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

    కానీ.. ఇప్పుడు అగ్రరాజ్యం అధినేత ట్రంప్‌ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నాలుగేళ్లు అధికారంలో ఉన్న ఆయన మరోసారి అధికారంలోకి వచ్చేందుకు చెమటోడ్చాల్సి వస్తోంది. ప్రత్యర్థితో హోరాహోరీగా తలపడాల్సి వచ్చింది. ఆయన ఇలా ఎదురీదాల్సి రావడానికి కూడా కారణాలు లేకపోలేదు. అవన్నీ ఆయన స్వయం కృపరాధమే అని చెప్పొచ్చు. ముఖ్యంగా నోటి దురుసుతనం.. మహిళల పట్ల అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం.. గొప్పలు చెప్పుకోవడం.. కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం.. తన తప్పులను ప్రశ్నిస్తే హేళన చేయడం.. సెక్స్‌ స్కాండల్స్‌.. ఇవీ ఆయన ప్రస్తుత పరిస్థితికి కారణాల్లో మచ్చుకు కొన్ని.

    ఇదిలా ఉండగా.. ఈ ఎన్నికల్లో ట్రంప్‌ ఓడిపోయినా ఘోరమైన ఓటమి కిందికి రాదు. దాదాపు 6.8 కోట్ల ఓట్లతో చివరి దాకా బైడెన్‌తో నువ్వానేనా అన్నట్టుగా పోరాడారు. మరి ఇన్ని ఓట్లు ఎలా వచ్చాయి? అయినా ఎలక్టోరల్‌ ఓట్ల సాధనలో ఎందుకు వెనకబడ్డారు? అంటే.. ఈ రెండు ప్రశ్నలకూ రెండు ప్రధాన కారణాలున్నాయి. మొదటిది ట్రంప్‌ జాతీయవాద వైఖరి. ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌’ అంటూ 2016లో అధికారంలోకి వచ్చిన ట్రంప్‌.. వలస నిబంధనలను కఠినతరం చేశారు. తమ ఉద్యోగాలను భారతీయులు, చైనీయులు కొల్లగొడుతున్నారన్న అసంతృప్తిలో ఉన్న చాలా మంది అమెరికన్లను ట్రంప్‌ ధోరణి ఆకర్షించింది. పన్ను రేట్లను తగ్గించారు. పేదరికాన్ని, నిరుద్యోగితను తగ్గించారు. ట్రంప్‌ హయాంలో.. గత 50 ఏళ్లల్లోనే అతి తక్కువ నిరుద్యోగిత అమెరికాలో నమోదైంది.

    Also Read: అమెరికా సమాజంపై ట్రంప్ ప్రభావం ఇప్పట్లో పోదు

    ‘ప్రపంచం ఏమైపోతే నాకేం. మా అమెరికన్లకు ఉద్యోగాలు కావాలి’ అన్నట్టుగా వ్యవహరించారు. ఇవన్నీ ‘కాలేజీ డిగ్రీలు లేని సగటు శ్వేతజాతి యువతీ యువకుల’ను బాగా ఆకట్టుకున్నాయి. లిండన్‌ జాన్సన్‌ హయాం తర్వాత మళ్లీ ట్రంప్‌ వచ్చాకే పేదరికం బాగా తగ్గింది. అందుకే ట్రంప్‌కు 2016 ఎన్నికల కంటే 40 లక్షల ఓట్లు ఎక్కువగా పడ్డాయి. ఇక వెనుకబడేందుకు గల కారణాల్లో.. కరోనా కట్టడి వైఫల్యం ప్రధానమైనది. మహమ్మారిని అడ్డుకోవడంలో ట్రంప్‌ ఘోరంగా విఫలమయ్యారు.

    మరోవైపు అమెరికాలో కరోనా పెద్ద కల్లోలమే సృష్టించింది. కానీ.. దానిని కట్టడి చేయడంలో ట్రంప్‌ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఆయన వైఖరితో దాదాపు 2.3 లక్షల మంది ప్రజలు చనిపోయారు. ఇదే చివరికి ట్రంప్‌ పుట్టి ముంచింది. కరోనా విషయంలో ట్రంప్‌పై ఉన్న ప్రజాగ్రహాన్ని గమనించిన బైడెన్‌.. ‘ట్రంపు ఓటమితోనే కరోనా కట్టడి మొదలు కానుంది’ అంటూ పిలుపునిచ్చారు. అందుకే ఆయన సక్సెస్‌ కాగలిగారు.

    Also Read: చంద్రబాబులోనూ ట్రంప్‌ లక్షణాలు.. నెటిజన్ల ట్రోల్‌?

    ట్రంప్‌ అహంకారపూరిత వైఖరి కూడా ఆయనకు నెగెటివ్‌లా మారింది. తమను లైంగికంగా వేధించాడంటూ 22 మంది మహిళలు ఆరోపించడం కూడా వ్యతిరేకతను పెంచాయి. ప్రత్యర్థిపార్టీ నేతలపైనే కాదు.. తన తోటి రిపబ్లికన్‌ మహిళా నేతలపైనా, ఆఖరికి సొంతకూతురిపైనా ఆయన నోటిదురుసు ఇదే స్థాయిలో ఉంటుంది. ఉదాహరణకు.. తన కుమార్తె ఇవాంకా ట్రంప్‌ గురించి.. ‘‘ఆమెకు చాలా మంచి సౌష్ఠవం ఉంది. ఆమె నా కూతురు కాకపోయి ఉంటే ఆమెతో నేను డేటింగ్‌ చేసేవాణ్ని’’ అని వ్యాఖ్యానించడం చాలా మందిలో ఆయనపై అసహ్యాన్ని పెంచింది. అలాగే.. ఒక మహిళా జర్నలిస్టును ఉద్దేశించి.. ‘నా సమాధానాలతో ఆమె కళ్లతో పాటు ఎక్కడెక్కడి నుంచో రక్తం కారింది’ అని హేయమైన వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ అమెరికన్లలోని ఒక వర్గంలో ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. అందుకే ట్రంప్‌కు ఈ పరిస్థితి వచ్చిందనేది నిపుణుల అభిప్రాయం.