
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. అనుభవం లేని జగన్ ఏమేరకు రాణిస్తారో అని అందరు అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ అందరి అంచనాలు పటాపంచలు చేస్తూ పరిపాలనలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. మచ్చ లేని నాయకుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. అవినీతికి తావులేకుండా పాలనలో నీతికే ప్రాధాన్యమిస్తున్నారు. ప్రజాధనాన్ని ప్రజలకే నేరుగా అందేలా నగదు బదిలీ చేస్తున్నారు.
జగన్ సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రూ. లక్షల కోట్లు అప్పులు చేసినా అవి ప్రజలకు నేరుగా వెళ్లేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నారు. దీంతో ప్రతిపక్షాలు సైతం దీనిపై మాట్లాడలేకపోతున్నాయి. నూటికి తొంబై శాతం ఆదాయాన్ని నగదు బదిలీ పథకం ద్వారా జనాలకు అందించడంతో అవినీతికి ఆస్కారం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీ కూడా జగన్ పై విమర్శలు చేయలేకపోతోంది.
కరోనా మొదటి దశలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది. 2020-21 సంవత్సరంలో రూ.1.17 వేల కోట్లు ఏపీకి వచ్చాయి. దీంతో రూ.57 వేల కోట్లు ప్రభుత్వం అప్పుగా తెచ్చింది. ఇంత మొత్తంలో అప్పులు తెచ్చారు ఏం చేశారని అంటే అంతా కళ్ల ముందే కనిపిస్తోంది. జగన్ సర్కారు ప్రాధాన్యతా క్రమంలో 90 శాతం సంక్షేమ కార్యక్రమాలకే ఖర్చు చేస్తోంది. మౌలిక వసతుల కల్పనకు కేవలం 11 శాతం మాత్రమే కేటాయిస్తున్నారు. మానవ వనరుల అభివృద్ధికే ఖర్చు చేస్తుండడంతో మేధావులు సైతం ప్రశంసిస్తున్నారు.
జగన్ తన తండ్రిని అడ్డం పెట్టుకుని రూ. లక్షల కోట్లు అవినీతి చేశారని ఆరోపణలు చేస్తున్నారు. కానీ రెండేళ్ల పరిపాలనతో మచ్చలేని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అవినీతి రహిత పాలనే ధ్యేయంగా రికార్డు నెలకొల్పారు. నిధులను అభివృద్ధికి ఖర్చు చేయడం లేదని విమర్శిస్తున్నారు. కానీ అవినీతి జరిగిందని మాత్రం చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు