https://oktelugu.com/

హుజురాబాద్ టీఆర్ఎస్ రేసులో ఐదుగురు.. కేసీఆర్ చేతిలో లిస్ట్

హుజురాబాద్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. పార్టీలు తమ అభ్యర్థుల వేటలో మునిగిపోయాయి. ఇప్పటికే అధికార పార్టీ పలువురు పేర్లను పరిశీలిస్తోంది. గులాబీ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను పార్టీ నుంచి బయటకు పంపిన నేపథ్యంలో హుజురాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈటల బీజేపీలో చేరడంతో ఇతర పార్టీల వారు తమ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ప్రారంభించారు. గెలుపు గుర్రాల వేటలోపడ్డారు. ఎవరికి ప్రజాబలముంది? ఎవరైతే గట్టెక్కిస్తారనే విషయాలపై […]

Written By: , Updated On : July 14, 2021 / 09:50 AM IST
Follow us on

KCR on Huzurabad Bypollహుజురాబాద్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. పార్టీలు తమ అభ్యర్థుల వేటలో మునిగిపోయాయి. ఇప్పటికే అధికార పార్టీ పలువురు పేర్లను పరిశీలిస్తోంది. గులాబీ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను పార్టీ నుంచి బయటకు పంపిన నేపథ్యంలో హుజురాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈటల బీజేపీలో చేరడంతో ఇతర పార్టీల వారు తమ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ప్రారంభించారు. గెలుపు గుర్రాల వేటలోపడ్డారు. ఎవరికి ప్రజాబలముంది? ఎవరైతే గట్టెక్కిస్తారనే విషయాలపై ఆరా తీస్తున్నారు. కేసీఆర్ అయితే ఇప్పటికే పలు సర్వేలు చేయించి అభ్యర్థుల బలాబలాలపై ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం.

హుజురాబాద్ ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. కేంద్రం ఎప్పుడు ఎన్నిక నిర్వహిస్తుందో తెలియని సందర్భంలో ముందే అభ్యర్థి ప్రకటన చేస్తే ప్రచారం సలువు అవుతుందనే భావనలో ఉన్నట్లు సమాచారం. దీంతో అభ్యర్థుల బలాబలాలపై సర్వే చేయించారు. ఎవరికి ఎంత బలముందే దానిపై స్పష్టమైన ఆదారాలు తెప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వ్యూహాలు పక్కాగా ఉండాలని చూస్తున్నారు.

హుజురాబాద్ బరిలో నిలిచే వారిలో ఐదుగురు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ముద్దసాని మాలతి, ముద్దసాని పురుషోత్తం రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, స్వర్గం రవి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేర్లు ఉన్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం ప్రగతిభవన్ లో జరిగిన చర్చలో కూడా ఈ ఐదుగురు గురించే చర్చించినట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరైతే బాగుంటుందనే విషయంపై సమగ్రంగా ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సీఎం కేసీఆర్ హుజురాబాద్ ఉప ఎన్నికపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారం రోజుల్లో అభ్యర్థి ప్రకటన చేసేలా కార్యాచరణ ప్రారంభించారు. ఐదుగురిలో బలమైన వారి కోసం అన్వేషణ చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థి ప్రకటన ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. త్వరగా అభ్యర్థిని ప్రకటిస్తే ప్రచారం కూడా సులువుగా ఉంటుందని అభిప్రాయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.

ఇప్పటికే పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి . బీజేపీ తప్ప ఏ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో ప్రచారం కాస్త ఇబ్బందిగానే మారుతోంది. ఈటలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో పార్టీలు కదులుతున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే తపనతో వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి. ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు కదులుతునన్నాయి. నియోజకవర్గమంతా ఇప్పటికే జల్లెడ పట్టి ప్రజల ముందకు వెళుతున్నారు. దీంతో అప్పుడే ఎన్నికల సందడి నెలకొన్నట్లుగా తెలుస్తోంది.