America Shooting: అమెరికాలో కాల్పుల కలకలం రేగుతూనే ఉంది. క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో ప్రజలందరు సంతోషాలతో గడుపుకునే సమయంలో కూడా కాల్పులు జరగడం దారుణం. రెండు రోజుల సమయంలో వేరువేరు ఘటనల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు తీవ్రంగా గాయపడటం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమ అమెరికాలోని కొలరాడో రాజధాని డెన్వర్ లో సోమవారం జరిగిన కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు. దక్షిణ మద్య రాష్ర్టం టెక్సాస్ లో ఆదివారం బాలుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు.

కొలరాడో రాష్ర్టం డెన్వర్ లో, లేక్ వుడ్ నగరాల్లోని నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఒక వ్యక్తి జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. నిందితుడిని అంతమొందించినట్లు పోలీసులు తెలిపారు. డెన్వర్ లో జరిపిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు, ఒక వ్యక్తి చనిపోయారు. లేక్ వుడ్ లో మరో వ్యక్తిని కాల్చి చంపడం తెలిసిందే. అయితే కాల్పులు జరుపుతూ వెళుతున్న వ్యక్తిని పోలీసులు మట్టుబెట్టారు.
Also Read: వంగవీటి రాధా హత్యకు కుట్ర.. జగన్ ను డిఫెన్స్ లో పడేస్తున్న చంద్రబాబు సెంటిమెంట్ రాజకీయం
డెన్వర్ కాల్పుల సంఘటనలో పోలీస్ అధికారి గాయపడ్డాడు. కాల్పులపై ఎలాంటి సమాచారం లభించలేదు. మరోవైపు టెక్సాస్ రాష్ర్టంలోని గార్లాండ్ సిటీలో మరో కాల్పుల ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కన్వీనియన్స్ స్టోర్ లో 14 ఏళ్ల బాలుడు తుపాకీ చేతపట్టుకుని కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఒకరు గాయపడినట్లు తెలిసింది. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
అమెరికాలో కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం కొత్తేమీ కాదు. గతంలో కూడా చాలా జరిగాయి. తాజాగా జరిగిన ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం మరికొందరు గాయపడటం తెలిసిందే. మొత్తానికి అమెరికాలోని సంస్కృతికి అందరు బాధ్యులే అవుతున్నారు. క్షణికావేశంలో దుండగులు జరిపే దాడుల్లో ఏ పాపం ఎరుగని సామాన్య పౌరులు మరణించడం తెలిసిందే.
Also Read: వరి పోరులో గెలుపు టీఆర్ఎస్ ఖాతాలోకి?