
అధికారం కోసం 3వేల కిలోమీటర్లకు పైగా రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన వైఎస్ జగన్ వెనకడుగు వేసిన చరిత్ర లేదు. నాడు వైఎస్ మృతితో పరామర్శకు వెళతానంటే సోనియా సహా కాంగ్రెస్ పెద్దలు వద్దన్నారు. అయినా వినలేదు. సీఎం పీఠం ఆశిస్తే ఇవ్వకపోతే వైసీపీ పార్టీ పెట్టాడు. కాంగ్రెస్ ను ఎదురించాడు. 16 నెలల పాటు జైలు పాలయ్యాడు. ఇలా ఎన్ని కష్టాలు వచ్చినా జైలుపాలైనా ఎక్కడా వెనకడుగు వేసిన చరిత్ర వైఎస్ జగన్ లో లేదు. అధికారంలోకి రాగానే టీడీపీకి వ్యతిరేకంగా మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపక్కన ప్రగతి వేదికను కూల్చడం దగ్గరి నుంచి మూడు రాజధానుల వరకు ఎక్కడా జగన్ వెనకడుగు వేయ లేదు. అంతటి జగన్ చరిత్రలో తొలిసారి వెనకడుగు వేశారు. ఇది నిజంగా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
*తిరుమలేషుడితో పెట్టుకుంటే డేంజర్ మరీ
సీఎం జగన్ గద్దెనెక్కాక చేసిన తొలి నియామకం టీటీడీ బోర్డు చైర్మన్ గా తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ఎంపిక. దేశంలోనే అతిపెద్ద భారీ దేవాలయం..వందల కోట్లలో ఆదాయం వచ్చే తిరుమలేషుడి బోర్డుకు చైర్మన్ గా జగన్ తన సొంత బాబాయ్ ని ఎంపిక చేశారు. ఆ తర్వాత ఎస్వీబీసీ చైర్మన్ గా నటుడు పృథ్వీ వివాదాలతో పదవి పోగొట్టుకున్నాడు. అయితే ఎప్పుడు ఎవరూ కూడా తిరుమల వేంకటేశ్వరుడితో పెట్టుకుంటే ప్రగతి సాధించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఆలయ ట్రస్ట్ భూములను అమ్మాలని టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నిర్ణయించడం పెద్ద దుమారంరేపింది. ప్రపంచంలోనే సంపన్న ఆలయానికి ఈ భూముల అమ్మకపోతే ఆదాయం లేదా అని అందరూ ప్రశ్నించారు. తిరుమలేషుడితో పెట్టుకుంటే డేంజర్ అని ఆడిపోసుకున్నారు.
*జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా వేల పోస్టులు
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ భూములు అమ్మకం చాలా మంది భక్తుల మనో భావాలు దెబ్బతీసింది. సోషల్ మీడియాలో జగన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తాయి. దీంతో వైవీ సుబ్బారెడ్డి నిర్ణయంపై ఏకంగా జగన్ సీరియస్ అయినట్టు తెలిసింది..
*తొలిసారి జగన్ వెనకడుగు
సర్వాత్రా విమర్శలు రావడంతో భూముల అమ్మకంపై జగన్ వెనకడుగు వేశారు. తన బాబాయి .. టీటీడీ చైర్మన్ తో అమ్మకాలను చేయడం లేదని వివరణ ఇప్పించారు. ఇలా జగన్ సీఎం కాకముందు.. అయిన తర్వాత తొలిసారి వెనకడుగు వేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అమరావతి రాజధాని భూముల నుంచి మొదలు పెడితే ఇంగ్లీష్ మీడియం చదువుల వరకు అన్నింటిలోనూ తన పంతం నెగ్గించుకున్న జగన్ తిరుమలేషుడి విషయంలో మాత్రం గాడ్స్ తో గేమ్స్ వద్దని జగన్ వెనకడుగు వేయడం విశేషంగా మారింది.
-నరేశ్ ఎన్నం