పాక్ చరిత్రలో తొలిసారి హిందూ పైలట్ నియామకం

భారత్ లో ముస్లింలు, ఇతర వర్గాల వర్గాలు మైనార్టీలుకాగా పాకిస్థాన్లో హిందువులు మైనార్టీలు. దేశ విభజన జరిగిన 73ఏళ్లలో భారత్ సెర్య్యూలర్ దేశంగా అభివృద్ధి చెందుతూ ముందుకెళుతోంది. భారత్ లో ముస్లింలు కింది స్థాయి నుంచి రాష్ట్రపతి వరకు అన్ని స్థానాల్లో వారికి అవకాశాలు దక్కాయి. అయితే పాకిస్థాన్లో మాత్రం హిందువులకు నేటికి సరైన అవకాశాలు లేవని అందరికీ తెల్సిన విషయమే. మతం ఆధారంగా ఏర్పడిన పాకిస్థాన్లో తొలిసారి ఓ హిందువు పైలట్ గా నియామకమై చరిత్ర […]

Written By: Neelambaram, Updated On : May 5, 2020 2:37 pm
Follow us on


భారత్ లో ముస్లింలు, ఇతర వర్గాల వర్గాలు మైనార్టీలుకాగా పాకిస్థాన్లో హిందువులు మైనార్టీలు. దేశ విభజన జరిగిన 73ఏళ్లలో భారత్ సెర్య్యూలర్ దేశంగా అభివృద్ధి చెందుతూ ముందుకెళుతోంది. భారత్ లో ముస్లింలు కింది స్థాయి నుంచి రాష్ట్రపతి వరకు అన్ని స్థానాల్లో వారికి అవకాశాలు దక్కాయి. అయితే పాకిస్థాన్లో మాత్రం హిందువులకు నేటికి సరైన అవకాశాలు లేవని అందరికీ తెల్సిన విషయమే. మతం ఆధారంగా ఏర్పడిన పాకిస్థాన్లో తొలిసారి ఓ హిందువు పైలట్ గా నియామకమై చరిత్ర సృష్టించాడు. దీంతో ఆ దేశ పత్రికలతోపాటు అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ వార్తను పతాక శీర్షికల్లో ప్రచురించాయి.

వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు..!

పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్‌లో హిందువులు అత్యధికంగా నివసిస్తున్నారు. థార్పర్కర్ జిల్లాలోని ఓ చిన్నగ్రామంలో జన్మించిన రాహుల్‌ దేవ్‌ అనే యువకుడు ఉన్నత విద్యనభ్యసించి ఈ స్థాయికి చేరినట్లు పేర్కొన్నాయి. రాహుల్ దేవ్ పాక్ వైమానిక దళంలో జనరల్‌ డ్యూటీ పైలట్‌గా నియామవడంపై ఆల్‌ పాకిస్థాన్‌ హిందూ పంచాయత్‌ సెక్రటరీ రవి దవానీ హర్షం వ్యక్తం చేశారు. పాకిస్థాన్లో మైనార్టీ వర్గానికి చెందిన అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులుగా, సైనిక దళాల్లో సేవలందిస్తున్నారని ఆయన అన్నారు. హిందూ మతానికి చెందిన చాలామంది వైద్యులుగా సేవలందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం మైనార్టీ వర్గాలపై దృష్టిపెడితే, చాలామంది రాహుల్‌ దేవ్‌లు భవిష్యత్తులో దేశసేవకు సిద్ధమవుతారని ఆయన తెలిపారు.